Weekend Getaways । ఈ వారాంతంలో నగర జీవితానికి దూరంగా గడిపేందుకు అద్భుతమైన ప్రదేశాలు!-6 best weekend getaways from delhi city life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  6 Best Weekend Getaways From Delhi City Life

Weekend Getaways । ఈ వారాంతంలో నగర జీవితానికి దూరంగా గడిపేందుకు అద్భుతమైన ప్రదేశాలు!

Mar 23, 2023, 04:20 PM IST HT Telugu Desk
Mar 23, 2023, 04:20 PM , IST

Weekend Getaways: మీరు ఢిల్లీ చుట్టుపక్కల ఉంటూ ఈ వారాంతంలో సరదాగా ఏదైనా ఔట్ స్టేషన్ వెళ్లి గడపాలనుకుంటే ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోండి.

దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడూ చాలా సందడిగా ఉండే నగరం. దేశం నలుమూలల నుంచి ఇక్కడ చాలా మంది నివసించే వారు ఉంటారు. అందులో మీరూ లేదా మీ వాళ్లు ఎవరైనా ఉంటే ఈ వారాంతంలో గడపటానికి ఢిల్లీకి దగ్గర్లోని అద్భుతమైన ప్రదేశాలు ఏమిటో చూడండి. 

(1 / 7)

దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడూ చాలా సందడిగా ఉండే నగరం. దేశం నలుమూలల నుంచి ఇక్కడ చాలా మంది నివసించే వారు ఉంటారు. అందులో మీరూ లేదా మీ వాళ్లు ఎవరైనా ఉంటే ఈ వారాంతంలో గడపటానికి ఢిల్లీకి దగ్గర్లోని అద్భుతమైన ప్రదేశాలు ఏమిటో చూడండి. (Pexels)

ఆగ్రా - ఢిల్లీ నుండి కేవలం 4 గంటల దూరంలో ఉన్న ఆగ్రాలో ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన అద్భుతమైన తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా దాని ప్రాచీన మొఘల్ వాస్తుకళ, సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. 

(2 / 7)

ఆగ్రా - ఢిల్లీ నుండి కేవలం 4 గంటల దూరంలో ఉన్న ఆగ్రాలో ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన అద్భుతమైన తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా దాని ప్రాచీన మొఘల్ వాస్తుకళ, సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. (Pexels)

జైపూర్ - పింక్ సిటీ అని కూడా పిలుస్తారు, జైపూర్ చరిత్ర, సంస్కృతి, వాస్తుకాళ గొప్పది. ఢిల్లీ నుండి 5 గంటల దూరంలో ఉన్న జైపూర్ రాజ కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, కలర్ ఫుల్ బజార్లకు ప్రసిద్ధి చెందింది. 

(3 / 7)

జైపూర్ - పింక్ సిటీ అని కూడా పిలుస్తారు, జైపూర్ చరిత్ర, సంస్కృతి, వాస్తుకాళ గొప్పది. ఢిల్లీ నుండి 5 గంటల దూరంలో ఉన్న జైపూర్ రాజ కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, కలర్ ఫుల్ బజార్లకు ప్రసిద్ధి చెందింది. (Pexels)

రిషికేశ్ - హిమాలయాల దిగువన ఉన్న రిషికేశ్ సాహస ప్రియులకు సరైన ప్రదేశం. ఇది భారతదేపు యోగా రాజధానిగా ప్రసిద్ధి. అదనంగా రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ , ట్రెక్కింగ్ వంటి సాహస కార్యకలాపాలను కూడా ఎంజాయ్ చేయవచ్చు. 

(4 / 7)

రిషికేశ్ - హిమాలయాల దిగువన ఉన్న రిషికేశ్ సాహస ప్రియులకు సరైన ప్రదేశం. ఇది భారతదేపు యోగా రాజధానిగా ప్రసిద్ధి. అదనంగా రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ , ట్రెక్కింగ్ వంటి సాహస కార్యకలాపాలను కూడా ఎంజాయ్ చేయవచ్చు. (Pexels)

ముస్సోరీ - క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు, ముస్సోరీ ఢిల్లీ నుండి 7 గంటల దూరంలో ఉన్న హిల్ స్టేషన్. ఇది హిమాలయాల అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. 

(5 / 7)

ముస్సోరీ - క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు, ముస్సోరీ ఢిల్లీ నుండి 7 గంటల దూరంలో ఉన్న హిల్ స్టేషన్. ఇది హిమాలయాల అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. (Pexels)

నైనిటాల్ - నైనిటాల్ ఢిల్లీ నుండి 7 గంటల దూరంలో ఉన్న మరొక ప్రసిద్ధ హిల్ స్టేషన్.  నిర్మలమైన సరస్సులు, అందమైన పర్వతాలు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. 

(6 / 7)

నైనిటాల్ - నైనిటాల్ ఢిల్లీ నుండి 7 గంటల దూరంలో ఉన్న మరొక ప్రసిద్ధ హిల్ స్టేషన్.  నిర్మలమైన సరస్సులు, అందమైన పర్వతాలు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. (Pexels)

అమృత్‌సర్ - అమృత్‌సర్ ఢిల్లీ నుండి 8 గంటల దూరంలో ఉన్న ఒక నగరం.  సిక్కు మతానికి చెందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన గోల్డెన్ టెంపుల్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ నగరం పంజాబ్ రాష్ట్ర గొప్ప చరిత్ర, సంస్కృతికి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది.

(7 / 7)

అమృత్‌సర్ - అమృత్‌సర్ ఢిల్లీ నుండి 8 గంటల దూరంలో ఉన్న ఒక నగరం.  సిక్కు మతానికి చెందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన గోల్డెన్ టెంపుల్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ నగరం పంజాబ్ రాష్ట్ర గొప్ప చరిత్ర, సంస్కృతికి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది.(Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు