Hyderabad IT : హైదరాబాద్ ఏఐ హబ్‌గా అభివృద్ధి చెందితే లాభాలు ఏంటీ.. 6 ముఖ్యమైన అంశాలు-6 benefits of hyderabad developing as an ai hub ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad It : హైదరాబాద్ ఏఐ హబ్‌గా అభివృద్ధి చెందితే లాభాలు ఏంటీ.. 6 ముఖ్యమైన అంశాలు

Hyderabad IT : హైదరాబాద్ ఏఐ హబ్‌గా అభివృద్ధి చెందితే లాభాలు ఏంటీ.. 6 ముఖ్యమైన అంశాలు

Published Feb 15, 2025 03:39 PM IST Basani Shiva Kumar
Published Feb 15, 2025 03:39 PM IST

  • Hyderabad IT : కృత్రిమ మేధస్సు.. ఈ రంగం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా హైదరాబాద్‌లో ఏఐ సిటినే నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో.. అసలు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే ఏంటీ.. ఈ రంగం అభివృద్ధి చెందితే హైదరాబాద్‌కు లాభాలు ఏంటనే చర్చ జరుగుతోంది.

ఇటీవల గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు హైదరాబాద్‌లో తమ ఏఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది హైదరాబాద్ ఏఐ హబ్‌గా మారడానికి ముఖ్యమైన ముందడుగు. ఏఐ హబ్‌గా మారడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఏఐ పరిశోధకులు వంటి వారికి అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

(1 / 6)

(istockphoto)

ఏఐ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల నగర ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు.

(2 / 6)

ఏఐ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు పెరుగుతాయి. ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది.

(3 / 6)

ఏఐ ఆధారిత స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం వల్ల పౌరులకు మెరుగైన సేవలు అందుతాయి.

(4 / 6)

ఏఐ ఆధారిత సాంకేతికతలు వైద్య రంగంలో అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతలు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

(5 / 6)

ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏఐ సిటీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

(6 / 6)

Basani Shiva Kumar

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు