TG Liquor Consumption : సౌత్ ఇండియాలో తెలంగాణే టాప్.. 50 శాతం మంది పురుషులు మందుబాబులే!-50 percent of men in telangana drink alcohol ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Liquor Consumption : సౌత్ ఇండియాలో తెలంగాణే టాప్.. 50 శాతం మంది పురుషులు మందుబాబులే!

TG Liquor Consumption : సౌత్ ఇండియాలో తెలంగాణే టాప్.. 50 శాతం మంది పురుషులు మందుబాబులే!

Published Feb 14, 2025 09:43 AM IST Basani Shiva Kumar
Published Feb 14, 2025 09:43 AM IST

  • TG Liquor Consumption : మద్యం వినియోగం విషయంలో తెలంగాణ రికార్డులను ఏ రాష్ట్రం బ్రేక్ చేయడం లేదు. సౌత్ ఇండియాలో తెలంగాణ టాప్‌లో ఉంది. జాతీయ సగటు కంటే.. తెలంగాణలో మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సౌత్ ఇండియాలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియపటేల్‌ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఈమేరకు బదులిచ్చారు. (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)

(1 / 6)

(istockphoto)

2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 34.9 శాతం మంది, తెలంగాణలో 53.8 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. 2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం.. ఏపీలో ఈ సంఖ్య 31.2 శాతానికి, తెలంగాణలో 50 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా కూడా మద్యం సేవించే పురుషుల సగటు సంఖ్య 29.2 శాతం నుంచి 22.4 శాతానికి తగ్గింది అని కేంద్రం వెల్లడించింది. (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)

(2 / 6)

జూన్ 2024 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం షాపులు ఉన్నాయి. వీటితో పాటు 1,200 బార్లు, క్లబ్బులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ. 36 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)

(3 / 6)

తెలంగాణ సంస్కృతిలో మద్యం సేవించడాన్ని ఒక భాగంగా పరిగణిస్తారు. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాల్లోనూ మద్యం సేవించడం సాధారణం. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దీంతో చాలా మంది మద్యం కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడటం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)

(4 / 6)

తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్‌లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగా మద్యం వినియోగం పెరుగుతోంది. ఇటు నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన కారణంగా చాలా మంది మద్యం సేవించడం ద్వారా ఉపశమనం పొందాలని చూస్తారని.. మానసిక నిపుణులు చెబుతున్నారు. (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)

(5 / 6)

ఇటీవల రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. మద్యంపై పన్నులను పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిసార్లు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల సరఫరా తగ్గిపోతుంది. దీంతో కంపెనీలు ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తడి చేశాయి. అటు మద్యం తయారీకి అయ్యే ఖర్చు పెరగడం వల్ల.. ధరలు పెంచాలనే డిమాండ్ ఉంది. (మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)

(6 / 6)

Basani Shiva Kumar

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు