Wi-Fi speed: మీ వై ఫై చాలా స్లోగా ఉందా?.. ఈ ట్రిక్స్ తో మీ వై ఫై స్పీడ్ పెంచేయండి..
స్లో వై-ఫై స్పీడ్ తో విసుగు చెందుతున్నారా? వీడియోలను స్ట్రీమింగ్ చేసేటప్పుడు, కాల్స్ సమయంలో లాగ్ లను ఎదుర్కొంటున్నారా? మీ ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండటానికి ఇవే కారణం కావచ్చు. మీ వై-ఫై వేగాన్ని తిరిగి పొందడానికి ఈ ట్రిక్స్ పాటించండి.
(1 / 7)
మందకోడి ఇంటర్నెట్ తో విసిగిపోయారా? వీడియో స్ట్రీమింగ్ లో బఫరింగ్ ఇబ్బంది పెడుతోందా? వైఫై స్లోగా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కాదా. వైఫై స్లో కావడానికి చాలా కారణాలుంటాయి. అలాగే, వైఫై ని కాస్త స్పీడప్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూడండి.(Unsplash)
(2 / 7)
మీ వాడకం పెరిగితే మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. ఒకే కనెక్షన్ పై ఎక్కువమంది వినియోగదారులు ఉన్నా వేగం తగ్గుతుంది. ముఖ్యంగా పెద్ద ఫైళ్లను డౌన్లోడ్ చేసే సమయంలో, హై ఎండ్ గేమ్స్ ఆడే సమయంలో బఫరింగ్ సమస్య ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రొవైడర్లు అప్ లోడ్ వేగాన్ని పరిమితం చేస్తారు, దీనివల్ల స్ట్రీమింగ్ తో సమస్యలు వస్తాయి. ఫైబర్ కనెక్షన్ కు అప్ గ్రేడ్ చేయడం వల్ల సమతుల్య అప్ లోడ్, డౌన్ లోడ్ వేగాన్ని అందించవచ్చు.(Pexels)
(3 / 7)
మీ రూటర్ పాతదా?: వై-ఫై టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీ రూటర్ కొన్ని సంవత్సరాల కంటే పాతది అయితే, దానివల్ల కూడా స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. 160 మెగాహెర్ట్జ్ సపోర్ట్ తో వై-ఫై 5 నుంచి వై-ఫై 6 రౌటర్ కు అప్ గ్రేడ్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. (Unsplash)
(4 / 7)
మీ డివైజ్ Wi-Fi హార్డ్ వేర్ తనిఖీ చేయండి: మీ కంప్యూటర్ Wi-Fi హార్డ్ వేర్ వేగాన్ని పరిమితం చేయవచ్చు, మీ డివైజ్ పాతది లేదా తక్కువ నాణ్యత అయినది అయితే. మెరుగైన సిగ్నల్ రిసెప్షన్ కోసం మెరుగైన వై-ఫై అడాప్టర్లు లేదా బాహ్య యాంటెన్నాలకు అప్ గ్రేడ్ చేయండి. ఇథర్ నెట్ ను ఉపయోగించడం ద్వారా గేమింగ్ కోసం వేగాన్ని పెంచవచ్చు.(Unsplash)
(5 / 7)
ఒకే వైఫై పై ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ హోమ్ పరికరాలను జోడించినప్పుడు, పాత రూటర్ సామర్ధ్యం సరిపోదు. AX5400 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కొత్త రూటర్ ను తీసుకోండి. అది అవసరమైన సామర్థ్యాన్ని, అధిక డేటా వినియోగాన్ని అందించవచ్చు.(Unsplash)
(6 / 7)
రౌటర్ సెట్టింగ్ లను ఆప్టిమైజ్ చేయండి: సరైన పనితీరు పొందడానికి మీ రౌటర్ సెట్టింగ్ లను చెక్ చేయండి. 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్ ను 80 మెగాహెర్ట్జ్ నుంచి 160 మెగాహెర్ట్జ్ కు పెంచండి. మీ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (QoS) సెట్టింగ్ లను సమీక్షించండి; QoS నిలిపివేయడం వల్ల వేగం మెరుగుపడుతుంది. అలాగే, పనితీరు మెరుగుదలలను అందించగల ఫర్మ్వేర్ అప్ గ్రేడ్స్ కోసం చూడండి.(Pixabay)
(7 / 7)
మీ రౌటర్ ను తరలించండి: మీ రూటర్ ను పెట్టిన స్థానం కూడా దాని స్పీడ్ ను ప్రభావితం చేస్తుంది. ఇతర అడ్డంకులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా, మీ రూటర్ ను ఎత్తు మీద ఉంచండి. ఫర్నిచర్ వెనుకనో లేక క్లోసెట్ లలోనో ఉంచడం మానుకోండి. మెరుగైన సిగ్నల్ డిస్ట్రిబ్యూషన్, మెరుగైన కనెక్టివిటీ కోసం పొడవైన కేబుల్స్ ఉపయోగించి మీ రౌటర్ ను సరైన ప్లేస్ లోకి మార్చండి.(Unsplash)
ఇతర గ్యాలరీలు