Hair Fall Reduce Tips : జుట్టు రాలడంతో విసిగిపోయారా? ఇదిగో మీకోసం 5 చిట్కాలు
- Home Remedies For Hair Fall : ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడాన్ని నివారించడంలో ఖరీదైన ఉత్పత్తులు ఎల్లప్పుడూ సహాయపడవు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు హోం రెమెడీస్ బాగా ఉపయోగపడతాయి.

(1 / 6)
జుట్టు రాలడాన్ని ఆపడానికి మార్కెట్‌లో ఎలాంటి ఉత్పత్తులు లేవు. కొన్నిసార్లు ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. దానికి బదులు మీరు మీ తలకు ఏం అప్లై చేస్తారు? ఆహారం తింటారు? అనేది కూడా ముఖ్యమే. జుట్టు రాలడం ఆగిపోయేందుకు తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా జుట్టును కాపాడుతాయి.
(2 / 6)
మెంతి గింజలను కొబ్బరి నూనెలో గ్రైండ్ చేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూ ఉపయోగించి గోరువెచ్చని నీటితో మీ తలను కడగాలి.
(3 / 6)
జుట్టు రాలడాన్ని నివారించడానికి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగండి. ఇది జుట్టు సమస్యలను నివారిస్తుంది.
(4 / 6)
తాజా కలబందను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. చుండ్రు సమస్యను కూడా దూరం చేస్తుంది.
(5 / 6)
కొబ్బరి నూనెను ఉసిరి రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది.
ఇతర గ్యాలరీలు