(1 / 6)
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 గదను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సౌతాఫ్రికా గెలిచిన ఐసీసీ టోర్నీ ఇదే. ఈ విజయంతో దక్షిణాఫ్రికా టీమ్ తో పాటు ఆ దేశం సంబరాల్ల తేలిపోతోంది.
(AP)(2 / 6)
దక్షిణాఫ్రికా హిస్టారిక్ విక్టరీలో ముందుగా చెప్పుకోవాల్సింది మార్ క్రమ్ గురించే. 282 పరుగుల ఛేజింగ్ లో ఆసీస్ బౌలింగ్ సవాలును దాటుకుని అతను నిలబడ్డాడు. 136 పరుగుల సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికాను దాదాపు ఒంటిచేత్తో గెలిపించాడు.
(Action Images via Reuters)(3 / 6)
కెప్టెన్ బవుమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెప్టెన్సీ, బ్యాటింగ్ తో అతను దక్షిణాఫ్రికాను ఛాంపియన్ గా నిలిపాడు. టెస్టు కెప్టెన్ గా అతనికి ఓటమన్నదే లేదు. బవుమా సారథ్యంలో 10 టెస్టులాడిన దక్షిణాఫ్రికా 9 గెలిచింది. ఒకటి డ్రా చేసుకుంది. ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ వరుసగా 36, 66 పరుగులతో మెరిశాడు బవుమా.
(AP)(4 / 6)
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా పేసర్ రబాడ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో ఆసీస్ నడ్డి విరిచన అతను.. సెకండ్ ఇన్నింగ్స్ లో మరో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
(Action Images via Reuters)(5 / 6)
డబ్ల్యూటీసీ ఫైనల్లో బెడింగ్ హమ్ కూడా కీ రోల్ ప్లే చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 45 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ లో అతనే టాప్ స్కోరర్. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ 21 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ముగించాడు.
(Action Images via Reuters)(6 / 6)
పేసర్లు మార్కో యాన్సెన్, ఎంగిడి కూడా సత్తాచాటారు. మ్యాచ్ లో యాన్సెన్ 4 వికెట్లు, ఎంగిడి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో యాన్సెన్ 3 వికెట్లతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్ లో ఎంగిడి 3 వికెట్లతో మెరిశాడు.
(Action Images via Reuters)ఇతర గ్యాలరీలు