Productivity । మీ పనితీరు మెరుగుపడాలంటే ఈ 5 అలవాట్లు మార్చుకోండి!
Productivity Tips: మీ అలవాట్లు కొన్ని మార్చుకుంటే మీ పనితీరు మెరుగుపడుతుంది, మీ ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మీ ఉత్పాదకతను పెంచడానికి మీరు మార్చుకోవలసిన అలవాట్లు ఏమిటో చూడండి.
(1 / 6)
మీరు రోజంతా పనిచేసినా మీ పనులు పూర్తవడం లేదా? అందుకు మీ అలవాట్లు కొన్ని కారణం కావచ్చు, మీ ఉత్పాదకను పెంచేందుకు ఈ అలవాట్లు మానేయండి. (Pexels)
(2 / 6)
మల్టీ టాస్కింగ్: ఇది మీ నైపుణ్యాలను తెలియజేయవచ్చు, కానీ వాస్తవానికి ఇది మీ ఉత్పాదకతను తగ్గిస్తుంది. మల్టీ టాస్కింగ్ వలన మీరు ఏ పని పూర్తి చేయలేరు. ఒక సమయంలో ఒక పనిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. (Pixabay)
(3 / 6)
పరధ్యానం: పనిచేస్తున్నప్పుడు పరధ్యానం వదిలేయండి, మీ పనిపై మీ ఏకాగ్రతను కలిగి ఉండండి. (Photo by Magnet.me on Unsplash)
(4 / 6)
మీ ఫోన్‌ని చేయడం: మీ ఫోన్‌ని తరచూ చెక్ చేయడం మానేయండి, ఫోన్ చెక్ చేసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయాన్ని పెట్టుకోండి. అత్యవసరం కాని విషయాల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. (Pexels)
(5 / 6)
విరామాలు తీసుకోకపోవడం: బ్రేక్ లేకుండా పనిచేయవద్దు. తరచుగా విరామాలు తీసుకోవడం వల్ల మీ మెదడు రీఛార్జ్ అవుతుంది. మరింత వేగంగా పనిచేస్తారు. (Unsplash)
(6 / 6)
తగినంత నిద్ర లేకపోవడం: నిద్ర లేకపోవడం మీ ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి.(Unsplash)
ఇతర గ్యాలరీలు