Honeymoon Tour : కేరళ రోమాంటిక్ టూర్.. హనీమూన్‌కు ఫేమస్ ఈ 5 ప్రదేశాలు!
- Honeymoon Tour : హనీమూన్.. చాలామంది లైఫ్ లాంగ్ గుర్తుండేలా ప్లాన్ చేసుకోవాలనుంకుటారు. కానీ.. ఏ ప్లేస్ హనీమూన్‌కు సెట్ అవుతుందనే అయోమయంలో ఉంటారు. అలాంటి వారి కోసం చాలా సంస్థలు హనీమూన్ ప్యాకేజీని ప్రకటిస్తాయి. ఆ ప్యాకేజీల్లో ఎక్కువ కేరళలోనే ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
- Honeymoon Tour : హనీమూన్.. చాలామంది లైఫ్ లాంగ్ గుర్తుండేలా ప్లాన్ చేసుకోవాలనుంకుటారు. కానీ.. ఏ ప్లేస్ హనీమూన్‌కు సెట్ అవుతుందనే అయోమయంలో ఉంటారు. అలాంటి వారి కోసం చాలా సంస్థలు హనీమూన్ ప్యాకేజీని ప్రకటిస్తాయి. ఆ ప్యాకేజీల్లో ఎక్కువ కేరళలోనే ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
(1 / 5)
కేరళలోని మున్నార్, కొచ్చి, కుమరకోమ్, అతిరపల్లి, కోవలం ప్రదేశాలు.. హనీమూన్‌కు అనుకూలంగా ఉంటాయి. బీచ్ వాకింగ్, హౌస్ బోట్‌లలో క్యాండిల్ లైట్ డిన్నర్, ఫైవ్ స్టార్ రిసార్ట్‌లలో విలాసవంతమైన వసతి, ఆయుర్వేద స్పా, మసాజ్‌లు, పచ్చని టీ తోటలు, పొగమంచు వంటి అందాలు కేరళలో కనువిందు చేస్తాయి.(irisholidays.com)
(2 / 5)
కేరళ హనీమూన్ ప్రదేశాలలో మొదటిది మున్నార్. పచ్చని తేయాకు తోటలు, తెల్లటి పొగమంచు, తెల్లవారుజామున సూర్యరశ్మి ఇక్కడ చాలా స్పెషల్. హనీమూన్‌కు ఇక్కడికి చాలామంది వస్తారు. మున్నార్ అందాలను, ఇక్కడి సువాసనలను ఆస్వాదిస్తూ.. హనీమూన్ జీవితాంతం గుర్తుండిపోయేలా గడుపుతారు. (irisholidays.com)
(3 / 5)
కేరళలోని వయనాడ్ జిల్లాలో చెంబ్రా శిఖరం.. ఎత్తైంది. ఇక్కడ లవ్ సింబల్‌లో సరస్సు చాలా ప్రత్యేకం. కేరళలోని ఉత్తమ హనీమూన్ ప్రదేశాలలో ఈ ప్రాంతం ఒకటి. లవ్ సింబల్‌లో ఉండే సరస్సులో ఏడాది మొత్తం నీరు ఉంటుంది. పొగమంచు కప్పబడి ఉంటుంది. ఏకాంతంగా గడపాలంటే.. ఇంతకంటే మంచి ప్లేస్ ఉండదని చాలామంది చెబుతారు.(irisholidays.com)
(4 / 5)
కేరళలో మరో రొమాంటిక్ ప్లేస్ కుమరకోమ్. పచ్చని వరి పొలాలు, ఊగుతున్న కొబ్బరి తోటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కుమరకోమ్‌లోని బ్యాక్ వాటర్స్ గుండా రొమాంటిక్ జర్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. అందుకే చాలా జంటలు హమీమూన్ కోసం ఇక్కడికి వస్తారు.(irisholidays.com)
(5 / 5)
హనీమూన్‌కు మరో అత్యుత్తమ ప్లేస్..మరారీ. ఇక్కడ బీచ్ చాలా ఫేమస్. కొత్తగా పెళ్లైన జంటలు ఇక్కడికి వస్తే.. ప్రశాంతంగా గడపొచ్చు. ఇక్కడ కాటేజ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిళ్లో స్విమ్మింగ్ పూల్స్ స్పెషల్. ఎవరికీ సంబంధం లేకుండా ఏకాంతంగా ఉంటాయి. ఇక బీచ్‌లో రొమాంటిక్ వాక్ మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది.(irisholidays.com)
ఇతర గ్యాలరీలు