(1 / 5)
అప్డేటెడ్ సిట్రోయెన్ సీ3 మిడ్, టాప్ వేరియంట్లలో అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్‌లతో వస్తుంది. ఈ మోడల్ ఎక్స్టీరియర్లో సంస్థ ఎలాంటి మార్పులు చేయలేదు.
(2 / 5)
సిట్రోయెన్ సీ3 కొత్త వేరియంట్ పేరు ఫీల్. ఎంట్రీ లెవల్ లైవ్, ఫీల్ (ఓ) ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది.
(3 / 5)
కొత్త ఫీల్ వేరియంట్లో రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎంలు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, రూఫ్ రైల్స్, స్పేర్ వీల్, వ్యానిటీ మిర్రర్‌తో ప్యాసింజర్ సన్‌వైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
(4 / 5)
మొత్తం మీద చూసుకుంటే సిట్రోయెన్ సీ3 ఎక్స్‌షోరూం ధర రూ. 6.23 లక్షల నుండి రూ .10.19 లక్షల వరకు ఉంది. కొత్తగా లాంచ్ అయిన ఫీల్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6.48లక్షలు
(5 / 5)
2025 సీ3లో ఎటువంటి మెకానికల్ మార్పులు లేవు, ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో అందుబాటులో ఉంది. ఇది 81బిహెచ్పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు, 1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్ 108 బీహెచ్పీ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సిట్రోయెన్ మాన్యువల్ వేరియంట్లలో లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది.
ఇతర గ్యాలరీలు