Himachal Pradesh: హిమాచల్ లో హిమపాతం
- హిమాచల్ ప్రదేశ్ లో మంచు దట్టంగా కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి 168 రహదారులను వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. హిమాచల్ లో హిమపాతం చూడండి..
- హిమాచల్ ప్రదేశ్ లో మంచు దట్టంగా కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి 168 రహదారులను వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. హిమాచల్ లో హిమపాతం చూడండి..
(1 / 7)
ఎగువ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో తాజాగా మంచు కురవగా, లోతట్టు, మధ్య కొండల్లో శనివారం అడపాదడపా వడగండ్ల వాన కురిసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 4 వరకు వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది.
(PTI)(2 / 7)
రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం శుక్రవారం రాత్రి రాష్ట్రంలో మూడు జాతీయ రహదారులతో సహా మొత్తం 168 రహదారులను వాహనాల రాకపోకలకు మూసివేశారు.
(ANI)(3 / 7)
రాష్ట్ర రాజధాని సిమ్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. సోలన్ లో వడగండ్ల వానలు కూడా కురిశాయి.
(ANI)(4 / 7)
మనాలీ సమీపంలోని రోహ్ తంగ్ లోని అటల్ టన్నెల్ వద్ద భారీ మంచు కురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత 24 గంటల్లో కల్పా, కుకుమ్సేరిలో 5 సెంటీమీటర్లు, కీలాంగ్లో 3 సెంటీమీటర్ల మంచు కురిసింది.
(ANI)(5 / 7)
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఏడు చోట్ల ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురుగాలులు (గంటకు 40-50 కిలోమీటర్లు) వీస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
(ANI)(6 / 7)
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ట్రాఫిక్, టూరిస్ట్, రైల్వేస్ పోలీసులు శనివారం లాహౌల్, స్పితి జిల్లాలకు ట్రాఫిక్ అప్డేట్ ను పోస్ట్ చేశారు.
(ANI)ఇతర గ్యాలరీలు