(1 / 5)
క్రికెట్ మైదానంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. అతని పరుగుల వేటకు బ్రేక్ లేదు. ఎక్కడ ఆడినా దంచడమే పనిగా అతను దూసుకెళ్తున్నాడు.
(Action Images via Reuters)(2 / 5)
ఈ రోజు (జూలై 5) ఇంగ్లాండ్ అండర్-19 టీమ్ తో జరుగుతున్న నాలుగో యూత్ వన్డేలో ఇండియా అండర్-19 తరపున వైభవ్ చెలరేగిపోయాడు. సెన్సేషనల్ హండ్రెడ్ సాధించాడు.
(Action Images via Reuters)(3 / 5)
వార్సెస్టెర్ లో జరుగుతున్న యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు.
(Action Images via Reuters)(4 / 5)
52 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ సాధించిన ప్లేయర్ గా రికార్డు నమోదు చేశాడు.
(Action Images via Reuters)(5 / 5)
ఈ ఏడాది ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అతను యూత్ టెస్టుల్లో, ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ సాధించాడు.
(Action Images via Reuters)ఇతర గ్యాలరీలు