Rahul Gandhi Jodo Yatra in Telangana: పలకరిస్తూ.. చేతులు కలుపుతూ…-10th day rahul gandhi bharat jodo yatra in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  10th Day Rahul Gandhi Bharat Jodo Yatra In Telangana

Rahul Gandhi Jodo Yatra in Telangana: పలకరిస్తూ.. చేతులు కలుపుతూ…

Nov 05, 2022, 07:07 PM IST HT Telugu Desk
Nov 05, 2022, 07:07 PM , IST

  • Bharat Jodo Yatra in Telangana: రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. శుక్రవారం విశ్రాంతి తీసుకున్న రాహుల్... ఇవాళ వేకుజామునే లేచి పాదయాత్ర చేపట్టారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో బసచేసిన రాహుల్ జోడోయాత్రను ఉదయాన్నే మొదలు పెట్టారు. చౌటకూర్, ఆందోల్, జోగిపేట, అన్నసాగర్ మీదుగా కొనసాగనున్న యాత్ర అల్లాదుర్గ్ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఇవాళ 21 కిలోమీటర్లమేర నడిచారు. జోడో యాత్రలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ తీవ్రంగా ఎండగడుతున్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే యాత్ర లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర 58 రోజులుగా కొనసాగుతోంది.

శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో బసచేసిన రాహుల్... జోడో యాత్రను ఉదయాన్నే మొదలు పెట్టారు.  ఈ సందర్భంగా ఓ కల్లు గీత కార్మికుడు కలవగా... అతని వద్ద ఉన్న మోకును ధరించారు,

(1 / 4)

శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో బసచేసిన రాహుల్... జోడో యాత్రను ఉదయాన్నే మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఓ కల్లు గీత కార్మికుడు కలవగా... అతని వద్ద ఉన్న మోకును ధరించారు,(twitter)

పాదయాత్రలో భాగంగా పలు వర్గాల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్ గాందీ. శనివారం స్వయంగా తన చేతులతో తయారవుతున్న మట్టికుండను పట్టుకున్నారు. ఈ చిత్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.

(2 / 4)

పాదయాత్రలో భాగంగా పలు వర్గాల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్ గాందీ. శనివారం స్వయంగా తన చేతులతో తయారవుతున్న మట్టికుండను పట్టుకున్నారు. ఈ చిత్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.(twitter)

ఓ అవ్వను ఆప్యాయంగా పలకరించారు రాహుల్ గాంధీ. దగ్గరికి తీసుకొని మాట్లాడారు.

(3 / 4)

ఓ అవ్వను ఆప్యాయంగా పలకరించారు రాహుల్ గాంధీ. దగ్గరికి తీసుకొని మాట్లాడారు.(twitter)

శనివారం పాదయాత్రలో విరామం సందర్భంగా మునుగోడు నియోజవవర్గ ఇంఛార్ద్ లు... రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో గ్రూప్ ఫొటో దిగారు.

(4 / 4)

శనివారం పాదయాత్రలో విరామం సందర్భంగా మునుగోడు నియోజవవర్గ ఇంఛార్ద్ లు... రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో గ్రూప్ ఫొటో దిగారు. (twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు