Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు-1 killed after roof collapses at delhi airports t1 amid heavy rain see pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Delhi Airport Pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Jun 28, 2024, 07:51 PM IST HT Telugu Desk
Jun 28, 2024, 07:51 PM , IST

Delhi Airport pics: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లోని టెర్మినల్ 1లోని డిపార్చర్ ఏరియాలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలింది. సపోర్టింగ్ బీమ్స్ కూడా కూలిపోయాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయాలపాలయ్యారు.

ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

(1 / 9)

ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.(AP)

ఢిల్లీ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే టెర్మినల్ 1లో విమాన కార్యకలాపాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేశారు.

(2 / 9)

ఢిల్లీ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే టెర్మినల్ 1లో విమాన కార్యకలాపాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేశారు.(Bloomberg)

ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిన ఘటన స్థలాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సందర్శించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1 పై కప్పు కూలిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. 

(3 / 9)

ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిన ఘటన స్థలాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సందర్శించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1 పై కప్పు కూలిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. (PTI)

ఈ ప్రమాదంలో పైకప్పు షీట్ తో పాటు, సపోర్ట్ బీమ్స్ కూలిపోయాయి, టెర్మినల్ పికప్, డ్రాప్ ప్రాంతంలో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. ధ్వంసమైన వాహనాల్లోని క్షతగాత్రులను గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. 

(4 / 9)

ఈ ప్రమాదంలో పైకప్పు షీట్ తో పాటు, సపోర్ట్ బీమ్స్ కూలిపోయాయి, టెర్మినల్ పికప్, డ్రాప్ ప్రాంతంలో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. ధ్వంసమైన వాహనాల్లోని క్షతగాత్రులను గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. (PTI)

గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున వర్షం నీరు వచ్చి చేరింది.

(5 / 9)

గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున వర్షం నీరు వచ్చి చేరింది.(AP)

ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు కూలిన నేపథ్యంలో, ప్రమాద స్థలాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి  రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

(6 / 9)

ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు కూలిన నేపథ్యంలో, ప్రమాద స్థలాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి  రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.(PTI)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ 1 పై కప్పు కుప్పకూలడంతో, వెలుపల వేచి ఉన్న ప్రయాణికులు. ఈ ప్రమాదం తరువాత టెర్మినల్ 1 నుండి అన్ని రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

(7 / 9)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ 1 పై కప్పు కుప్పకూలడంతో, వెలుపల వేచి ఉన్న ప్రయాణికులు. ఈ ప్రమాదం తరువాత టెర్మినల్ 1 నుండి అన్ని రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.(AP)

ఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1 పైకప్పు కూలిపోవడంతో ఆ టెర్మినల్ లో కార్యకలాపాలను నిలిపివేశారు. టీ1 నుంచి రావాల్సిన ఇండిగో విమానాలను టీ2, టీ3లకు, స్పైస్ జెట్ విమానాలను టీ2కు మారుస్తున్నట్లు డీఐఏఎల్ తెలిపింది.

(8 / 9)

ఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1 పైకప్పు కూలిపోవడంతో ఆ టెర్మినల్ లో కార్యకలాపాలను నిలిపివేశారు. టీ1 నుంచి రావాల్సిన ఇండిగో విమానాలను టీ2, టీ3లకు, స్పైస్ జెట్ విమానాలను టీ2కు మారుస్తున్నట్లు డీఐఏఎల్ తెలిపింది.(Bloomberg)

ఇండిగో, స్పైస్ జెట్ దేశీయ విమాన సర్వీసులు మాత్రమే టీ1లో ఉన్నాయి. టి 1, టి 2, టి 3 అనే మూడు టెర్మినల్స్ ఉన్న ఈ విమానాశ్రయం నుంచి సగటున ప్రతిరోజూ 1,400 విమానాల రాకపోకలు జరుగుతాయి.

(9 / 9)

ఇండిగో, స్పైస్ జెట్ దేశీయ విమాన సర్వీసులు మాత్రమే టీ1లో ఉన్నాయి. టి 1, టి 2, టి 3 అనే మూడు టెర్మినల్స్ ఉన్న ఈ విమానాశ్రయం నుంచి సగటున ప్రతిరోజూ 1,400 విమానాల రాకపోకలు జరుగుతాయి.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు