India Post office Recruitment 2022: పోస్టాఫీసుల్లో 98,083 ఖాళీలు: ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్! పూర్తి వివరాలు-india post may release notification for 98083 posts recruitment in november check full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Post May Release Notification For 98083 Posts Recruitment In November Check Full Details

India Post office Recruitment 2022: పోస్టాఫీసుల్లో 98,083 ఖాళీలు: ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్! పూర్తి వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 14, 2022 11:56 PM IST

India Post office Recruitment 2022: దేశంలోని అన్ని పోస్టల్ సర్కిళ్ల పరిధిలో 98,083 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 10వ తరగతి, ఇంటర్ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత, వయోపరిమితి, నోటిఫికేషన్‍తో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

India Post office Recruitment 2022: పోస్టాఫీసుల్లో 98,083 ఖాళీలు
India Post office Recruitment 2022: పోస్టాఫీసుల్లో 98,083 ఖాళీలు

India Post office Recruitment 2022: దేశంలోని 23 పోస్టల్ సర్కిళ్ల పరిధిలో మొత్తం 98,083 ఖాళీలు ఉన్నట్టు ఇండియా పోస్ట్ ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ షార్ట్ నోటిఫికేషన్‍ను కూడా విడుదల చేసింది. ఈ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రకియను ఇండియా పోస్ట్ త్వరలో మొదలుపెడుతుందని అంచనాలు ఉన్నాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈనెలలో వస్తుందని తెలుస్తోంది. షార్ట్ నోటిఫికేషన్ ద్వారా.. ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత వివరాలను పోస్టల్ శాఖ పేర్కొంది. 10వ తరగతి, ఇంటర్ విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

India Post office Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే

  • మొత్తం ఖాళీల సంఖ్య: 98,083

విభాగాల వారీగా..

  • పోస్ట్‌మ్యాన్: 59,099 ఖాళీలు
  • మల్టీటాస్కింగ్ (ఎంటీఎస్): 37,539 ఖాళీలు
  • మెయిల్ గార్డ్ : 1,445 ఖాళీలు

India Post office Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?

ఏపీ పోస్టల్ సర్కిల్ పరిధిలో మొత్తం 3,563 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2,289 పోస్ట్‌మ్యాన్, 108 మెయిల్ గార్డ్, 1,166 ఎంటీఎస్ పోస్ట్ లు ఉన్నాయి.

తెలంగాణ సర్కిల్‍లో 2,513 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,553 పోస్ట్‌మ్యాన్, 82 మెయిల్ గార్డ్, 878 ఎంటీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇండియా పోస్ట్ వెల్లడించింది.

India Post office Recruitment 2022: విద్యార్హత

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా ఇంటర్/12వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఉద్యోగాలకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

India Post office Recruitment 2022: వయో పరిమితి

పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు వయో పరిమితిలో సడలింపు ఉండనుంది.

India Post office Recruitment 2022: నోటిఫికేషన్ ఎప్పుడు?

ఇండియా పోస్ట్ లో ఈ 98వేల ఉద్యోగాలకు నవంబర్ లోనే నోటిఫికేషన్ వెలువడుతుందని అంచనాలు ఉన్నాయి. వేర్వేరుగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

ఈ పోస్టల్ ఉద్యోగాల కోసం ఆన్‍లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.indiapost.gov.inలో పూర్తి వివరాలు వెలువడుతాయి. అందుకే అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఈ ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‍సైట్‍ను చెక్ చేస్తూ ఉండాలి.

India Post office Recruitment 2022: ఎంపిక ప్రక్రియ

పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. జనవరిలో రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది.

IPL_Entry_Point

టాపిక్