SSY | సుకన్య సమృద్ధి యోజనతో రూ. 63,65,155 పొందండిలా..-how to open sukanya samriddhi yojana account ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssy | సుకన్య సమృద్ధి యోజనతో రూ. 63,65,155 పొందండిలా..

SSY | సుకన్య సమృద్ధి యోజనతో రూ. 63,65,155 పొందండిలా..

SSY scheme | ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే వర్తించేలా సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి కనిష్టంగా రూ. 250 చొప్పున, గరిష్టంగా రూ.1,50,000 వరకు పొదుపు చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం: అమ్మాయిలకు సుకన్య సమృద్ధి యోజన (unsplash)

10 ఏళ్ల లోపు అమ్మాయి పేరుపై తల్లిదండ్రుల్లో ఒకరు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. ఒక అమ్మాయికి ఒకే ఖాతా ఉండాలి. తల్లిదండ్రులు తమ ఇద్దరు ఆడపిల్లల పేర్లపై ఖాతా తెరవవచ్చు.

ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల వరకు ఈ ఖాతాను కొనసాగించవచ్చు. ఆదాయ పన్నుచట్టం సెక్షన్‌ 80సీ పరిధిలో సుకన్య సమృద్ధి యోజన పొదుపును మినహాయింపుగా చూపవచ్చు.

అమ్మాయి జన్మ ధ్రువీకరణ పత్రం, ఖాతా తెరిచేవారి (తల్లి లేదా తండ్రి) పత్రాలు అవసరం. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వచ్చే వరకు పొదుపు చేస్తూనే ఉండాలి.

లేనిపక్షంలో ఖాతాను అండర్‌ డీఫాల్ట్‌గా పరిగణిస్తారు. డీఫాల్ట్‌ అయితే ఏటా రూ. 50 చొప్పున పెనాల్టీ చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పొదుపుపై వడ్డీ రేటు ఇతర పొదుపు పథకాల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఏటేటా ఈ వడ్డీ రేటు మారుతుంది.

అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకూ ఖాతాను తల్లి లేదా తండ్రి నిర్వహిస్తారు. 18 ఏళ్లు వచ్చాక అవసరమైన పత్రాలు సమర్పించి అమ్మాయి ఆ ఖాతాను నిర్వహించుకోవచ్చు.

SSY నగదు విత్‌డ్రా చేసుకోవచ్చా?

అమ్మాయి పదో తరగతి పాసైనప్పుడు గానీ, 18 ఏళ్లు వచ్చాక గానీ.. మొత్తం నిధి నుంచి 50 శాతం వెనక్కి తీసుకోవచ్చు. దీనిని ఏకమొత్తంలో తీసుకోవచ్చు. లేదా ఇన్‌స్టాల్‌మెంట్లలోనైనా తీసుకోవచ్చు. ఏడాదికోసారి గరిష్టంగా ఐదేళ్లపాటు మాత్రమే తీసుకోవచ్చు.

విత్‌డ్రా చేసుకున్నప్పుడు ఉన్నత చదువుల కోసం వచ్చిన అడ్మిషన్‌ పత్రాన్ని గానీ, లేదా ఫీ బిల్లును కానీ విధిగా చూపాల్సి ఉంటుంది.

SSY మెచ్యూరిటీ డేట్‌ ఎప్పుడు?

సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూరిటీ చెందాలంటే ఖాతా తెరిచి 21 ఏళ్లు పూర్తి కావాలి. లేదా అమ్మాయి పెళ్లి చేసుకునే సందర్భంలో ఖాతాను ముగించవచ్చు. అయితే పెళ్లికి ఒక నెల ముందు నుంచి పెళ్లి అయ్యాక మూడు నెలలలోపే ఈ నిర్ణయం తీసుకోవాలి.

సుకన్య సమృద్ధి యోజనతో ఎంత ప్రయోజనం?

సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) ద్వారా ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. దీని ఆధారంగా మనం ఎంత జమ చేస్తే మెచ్యూరిటీ అయ్యాక ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం.

నెలకు రూ. 4 వేలు పొదుపు చేస్తే ఇలా..

ఉదాహరణకు ఇప్పుడు పాప వయస్సు 5 ఏళ్లు. 2022 నుంచి మీరు ప్రతి నెలా సుకన్య సమృద్ధి యోజన కింద రూ. 4 వేల చొప్పున, లేదా ఏటా రూ. 48 వేల చొప్పున జమ చేస్తూ ఉన్నారనుకుంటే.. పాపకు 21 ఏళ్ల వయస్సు వచ్చాక.. అంటే 2043లో మీ పొదుపు మెచ్యూరిటీ చెందుతుంది. ఆ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ. 7,20,000 అవుతుంది. దీనికి వడ్డీ (ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారం) రూ. 13,16,850 జమవుతుంది. ఒకవేళ ప్రస్తుత వడ్డీ రేటు పెరిగితే జమయ్యే వడ్డీ కూడా పెరుగుతుంది. వడ్డీ రేటు ఏటా మారుతుందని గమనించాలి. మొత్తంగా మీరు 2043లో రూ. 20,36,850 అందుకుంటారు.

పాపకు ఇప్పుడు ఐదేళ్ల వయస్సుంటే.. సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు రూ. 5 వేలు లేదా ఏడాదికి రూ. 60 వేలు జమ చేస్తే 2043లో రూ. 25,46,062 వస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు రూ. 6 వేలు లేదా ఏడాదికి రూ. 72 వేలు జమచేస్తే 2043లో రూ. 30,55,274 లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు రూ. 7 వేలు లేదా ఏడాదికి రూ. 84 వేలు జమ చేస్తే 2043లో రూ. 35,64,487 లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు రూ. 8 వేలు లేదా ఏడాదికి రూ. 96 వేలు జమ చేస్తూ పోతే 2043లో రూ. 40,73,699 లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు రూ. 9 వేలు లేదా ఏడాదికి రూ. 1,08,000 వేలు జమ చేస్తూ పోతే 2043లో రూ. 45,82,911 లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద నెలకు రూ. 10 వేలు లేదా ఏడాదికి రూ. 1,20,000 వేలు జమ చేస్తూ పోతే 2043లో రూ. 50,92,124 లభిస్తుంది.

ఒకవేళ సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్ఠంగా అవకాశం ఉన్న మేరకు నెలకు రూ. 12,500చొప్పున లేదా ఏడాదికి రూ. 1,50,000 జమ చేస్తే రూ. 63,65,155 లభిస్తుంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.