Aadhaar Download | ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలా? పీవీసీ కార్డు కోసం ఇలా..-how to download your aadhaar card or order pvc aadhaar card ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aadhaar Download | ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలా? పీవీసీ కార్డు కోసం ఇలా..

Aadhaar Download | ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలా? పీవీసీ కార్డు కోసం ఇలా..

Praveen Kumar Lenkala HT Telugu
Feb 20, 2022 03:49 PM IST

Aadhaar Download మీ ఆధార్‌ కార్డు స్టేటస్‌ తెలుసుకోవాలన్నా, డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నా, పీవీసీ కార్డ్ పొందాలన్నా ఆన్‌లైన్‌లో ఇవన్నీ చాలా సులువుగా చేయొచ్చు. ఇందుకోసం ఈ–ఆధార్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలి.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (Hidustan time telugu)

యూఐడీఏఐ‌కి చెందిన మై ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మై ఆధార్‌ అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకుని, అందులో నుంచి డౌన్‌లోడ్‌ ఆధార్‌ ఎంచుకోవాలి.

yearly horoscope entry point

ఆధార్‌ నెంబర్‌ గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ గానీ, వర్చువల్‌ ఐడీ గానీ ఉంటే ఇప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తదుపరి క్యాప్చా వెరిఫికేషన్‌ నింపాలి. ఇప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ నెంబర్‌ వస్తుంది.

ఓటీపీ నెంబర్‌ నింపగానే మీ కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ కార్డుకు పాస్‌వర్డ్‌ ఉంటుంది. మీ పేరులోనే మొదటి నాలుగు అక్షరాలు, మీ పుట్టిన సంవత్సరం పాస్‌వర్డ్‌గా ఉంటుంది.

ఉదాహరణకు మీ పేరు రాజ్‌కుమార్, పుట్టిన సంవత్సరం 2001 అయితే ఆర్‌ఏజేకే2001 మీ పాస్‌వర్డ్‌ అవుతుంది.

ఆధార్‌ పీవీసీ కార్డ్‌ దరఖాస్తు చేసుకోవడం ఎలా?

పీవీసీ కార్డు చినిగిపోకుండా మన్నికగా ఉంటుంది. లామినేషన్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇదే వెబ్‌ సైట్‌ నుంచి మై ఆధార్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని, అందులో ఆర్డర్‌ ఆధార్‌ పీవీసీ కార్డు ఆప్షన్‌ ఎంచుకోవాలి.

తదుపరి వచ్చే పేజీలో లాగిన్‌ అవ్వాలి. ఆధార్‌ నెంబర్, కింద సెక్యూరిటీ క్యాప్చా నింపాలి. తదుపరి సెండ్‌ ఓటీపీ బటన్‌ నొక్కాలి. మీ మొబైల్‌కు ఓటీపీ రాగానే దానిని ఈ పేజీలో నింపాలి.

ఆ వెంటనే వచ్చే పేజీలో ఆర్డర్‌ ఆధార్‌ పీవీసీ కార్డు అని వస్తుంది. ఆ బటన్‌ నొక్కగానే మీరు ఆర్డర్‌ చేయబోయే ఆధార్‌ కార్డు ప్రివ్యూ వస్తుంది.

నెక్స్ట్ బటన్‌ నొక్కగానే పేమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఐ హియర్‌ బై కన్ఫర్మ్‌ అన్న ఆప్షన్‌ నొక్కితే మేక్‌ పేమెంట్‌ బటన్‌ ఆప్షన్‌ ఆక్టివేట్‌ అవుతుంది. దీనిని నొక్కగానే పేమెంట్‌ గేట్‌ వే ఓపెన్‌ అవుతుంది.

క్రెడిట్‌ కార్డు, వాలెట్, పేటీఎం, నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ తదితర ఆప్షన్లలో ఒకటి ఎంచుకుని రూ. 50ల పేమెంట్‌ పూర్తిచేయాలి.

మీ ఆధార్‌ పీవీసీ కార్డు మీ ఆధార్‌ కార్డులో పొందుపరిచిన చిరునామాకు చేరుతుంది. ఇందుకు ఆర్డర్‌ చేసిన తేదీ నుంచి 5 పనిదినాలు పడుతుంది.

మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసుకోని వాళ్లు కూడా ఈ పీవీసీ కార్డును ఆర్డర్‌ చేయవచ్చు.

పీవీసీ ఆధార్‌ కార్డు ఎలా ఉంటుంది?

పీవీసీ ఆధార్‌ కార్డులో సెక్యూరిటీ ఫీచర్స్‌ చాలా ఉన్నాయి. సెక్యూర్‌ క్యూఆర్‌ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్ట్స్, ఘోస్ట్‌ ఇమేజ్, ఇష్యూ డేట్, ప్రింట్‌ డేట్, ఎంబోస్డ్‌ ఆధార్‌ లోగో వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.

 

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.