Zero Discrimination Day : మార్చ్​ 1న.. జీరో డిస్క్రిమినేషన్​ డేని ఎందుకు జరుపుకుంటారు?-zero discrimination day 2024 theme know date history significance ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Zero Discrimination Day 2024 Theme Know Date, History, Significance

Zero Discrimination Day : మార్చ్​ 1న.. జీరో డిస్క్రిమినేషన్​ డేని ఎందుకు జరుపుకుంటారు?

Sharath Chitturi HT Telugu
Mar 01, 2024 08:10 AM IST

Zero Discrimination Day 2024 : నేడు.. జీరో డిస్క్రిమినేషన్​ డే. దీని చరిత్రతో పాటు 2024 థీమ్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

మార్చ్​ 1న.. జీరో డిస్క్రిమినేషన్​ డేని ఎందుకు జరుపుకుంటాము?
మార్చ్​ 1న.. జీరో డిస్క్రిమినేషన్​ డేని ఎందుకు జరుపుకుంటాము?

Zero Discrimination Day 2024 theme : సమ్మిళితం, సమానత్వం శాంతిని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా వివక్ష ప్రభావం గురించి అవగాహన పెంచడానికి.. ప్రతి సంవత్సరం మార్చ్​ 1న.. జీరో డిస్క్రిమినేషన్ డే జరుపుకుంటారు. ఈ జీరో డిస్క్రిమినేషన్​ డే చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

జీరో డిస్క్రిమినేషన్​ డే.. చరిత్ర

ఈ జీరో డిస్క్రిమినేషన్​ డేని మొదటిసారిగా మార్చ్​ 1, 2014 జరుపుకున్నారు. పదేళ్ల క్రితం 2013 డిసెంబర్​లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా.. యుఎన్ఎయిడ్స్ ఈ జీరో డిస్క్రిమినేషన్ క్యాంపెయిన్​ని ప్రారంభించింది. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి), అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) పై ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం ఈ యుఎన్ఎయిడ్స్.

ప్రాముఖ్యత..

What is Zero Discrimination Day : జెండర్​, వయస్సు, లైంగికత, జాతి లేదా హెచ్ఐవీ స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో సమానత్వం, నిష్పాక్షికతను పెంపొందించడానికి యుఎన్ఎయిడ్స్.. పదేళ్ల క్రితం జీరో డిస్క్రిమినేషన్ డేని ఏర్పాటు చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, హెచ్ఐవీతో జీవిస్తున్న, ప్రభావితమైన ప్రజల హక్కుల గురించి అందరికి ఎలా తెలియజేయాలి? సమానంగా చూడాలని ఎలా ప్రోత్సహించాలి? వంటి అంశాలపై దృష్టి సారించడంతో జీరో డిస్క్రిమినేషన్ డే ప్రారంభమైంది.

Zero Discrimination Day history : "ఇటీవలి సంవత్సరాలలో ఇది జీవన నాణ్యత, ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం చూపే అన్ని రకాల వివక్షను అంతం చేయడంపై దృష్టి సారించింది," అని గ్లోబల్ హెల్త్ బాడీ డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.

ఈ జీరో డిస్క్రిమినేషన్ డే (మార్చ్​ 1) తో పాటు మార్చ్​ నెల మొత్తం, ఈవెంట్లు, కార్యకలాపాలు ఉంటాయి. జీరో డిస్క్రిమినేషన్​పై ముఖ్యమైన పాఠాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తాయి. చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తాయి. “ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడం ద్వారా, మనం ప్రతి ఒక్కరి హక్కులను కాపాడగలము,” అని చాటిచెబుతాయి.

What is meant by zero discrimination day : "అందరికీ హక్కులను నిలబెట్టడం ద్వారా, మేము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించగలుగుతాము. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, న్యాయమైన, దయగల, సంతోషకరమైన ప్రపంచాన్ని అందివ్వగలుగుతాము," అని యుఎన్ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయాన్యిమా అన్నారు.

థీమ్..

జీరో డిస్క్రిమినేషన్ డే 2024 థీమ్.. “ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడం, ప్రతి ఒక్కరి హక్కులను రక్షించడం.”

Zero Discrimination Day in India : “ఈ ఏడాది మార్చ్​ 1న జీరో డిస్క్రిమినేషన్ డే పదో వార్షికోత్సవం! ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వివక్షను అంతమొందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. మార్చ్​ 1న, మార్చి నెల మొత్తం, ఈవెంట్స్​, కార్యకలాపాలు,సందేశాలు.. ఒక ముఖ్యమైన పాఠాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తాయి. చర్యకు పిలుపునిస్తాయి. అది.. ”ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడం, ప్రతి ఒక్కరి హక్కులను రక్షించడం"," అని యుఎన్ఎయిడ్స్ తెలిపింది.

WhatsApp channel

సంబంధిత కథనం