Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. నగరంలో సీఎం తన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే లోపాన్ని గుర్తించిన పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా ఆగ్రాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ప్రయాగ్ రాజ్ లో ఇటీవల జరిగిన మహాకుంభమేళాకు 'మృత్యుంజయ్ మహాకుంభ్' అని యోగి ఆదిత్యానాథ్ అభివర్ణించారు. కుంభమేళాను మృత్య్ కుంభ్ గా అభివర్ణించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ‘‘జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రతిరోజూ 50,000 నుండి 100,000 మంది యాత్రికులు వచ్చారు. బెంగాల్ నుండి ప్రయాగ్ రాజ్ కు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురైంది’’ అని యూపీ సీఎం పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనతో ప్రాణనష్టం సంభవించిన నేపథ్యంలో మమతా బెనర్జీ కుంభమేళా ఏర్పాట్లను విమర్శించిన నేపథ్యంలో యూపీ సీఎం పై విధంగా స్పందించారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలతో సహా ప్రతిపక్షాలు ప్రతికూల వ్యాఖ్యలు చేయడం భారతీయుల విశ్వాసాన్ని అవమానించడమేనని యోగి విమర్శించారు. కుంభమేళాను సందర్శించిన వారికే కుంభమేళా అసలు అర్థం అర్థమవుతుందని యోగి అన్నారు.
సంబంధిత కథనం