No Non-Veg Day: నవంబర్ 25 ‘నో నాన్ వెజ్’ డే అట.. ఎందుకో తెలుసా?-yogi adityanath led up govt declares no non veg day today here is why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Yogi Adityanath Led Up Govt Declares 'No Non-veg' Day Today. Here Is Why

No Non-Veg Day: నవంబర్ 25 ‘నో నాన్ వెజ్’ డే అట.. ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Nov 25, 2023 03:26 PM IST

No Non-Veg Day: నవంబర్ 25వ తేదీని నో నాన్ వెజ్ డే గా నిర్వహించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు మాంసం అమ్మే దుకాణాలు, కబేళాలు మూసివేయాలని ఆదేశించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

No Non-Veg Day: యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ (Sadhu Thanwardas Lilaram) కి నివాళిగా నవంబర్ 25ని నాన్ వెజ్ డేగా ప్రకటించాలని యుపి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రతీ సంవత్సరం నవంబర్ 25వ తేదీన రోజు రాష్ట్రంలోని అన్ని కబేళాలు, మాంసం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ ఆదేశాలను రాష్ట్రవ్యాప్తంగా కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

సాధు తన్వర్ దాస్ లీలారామ్ వాస్వానీ ఎవరు?

మీరా ఉద్యమాన్ని ప్రారంభించిన విద్యావేత్త సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ (Sadhu Thanwardas Lilaram), నవంబర్ 25, 1879న జన్మించారు. సాధు వాస్వాని సాత్విక జీవన శైలిని, శాఖాహార విధానాన్ని ఎంతో ప్రోత్సహించారు. సాధు వాస్వాని జనవరి 16, 1966 న 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆ తరువాత, సాధు వాస్వానీ మిషన్ వాస్వానీ పుట్టినరోజున ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మాంసాహార రహిత దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

హలాల్ ఉత్పత్తులు

హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై యూపీ ప్రభుత్వం నిషేధం విధించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. నవంబర్ 18న, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హలాల్ ధృవీకరణతో ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ మరియు విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూపీలో హలాల్-ధృవీకరించబడిన మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిషేధించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన ఏ వ్యక్తి లేదా సంస్థపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఎగుమతులపై ఈ నిషేధం లేదు.

WhatsApp channel