World longest Ship Tourism: భారత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం-worlds longest river cruise to be inaugurated by pm modi on 13th january at varanasi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  World's Longest River Cruise To Be Inaugurated By Pm Modi On 13th January At Varanasi

World longest Ship Tourism: భారత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం

గంగ, బ్రహ్మపుత్ర నదులపై ప్రయాణించనున్న టూరిజం షిప్
గంగ, బ్రహ్మపుత్ర నదులపై ప్రయాణించనున్న టూరిజం షిప్

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వారణాసిలో జనవరి 13న ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభిస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం సర్క్యూట్ ను జనవరి 13 న వారణాసిలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంగానది, బ్రహ్మపుత్ర నదులపై 52 రోజుల పాటు ఇది కొనసాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

అతిపెద్ద రివర్ షిప్ టూరిజం

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గంగానది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభమై.. మార్చి 1న అస్సాంలోని దిబ్రూగఢ్ లో ముగియనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పెద్ద నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యాటన జరిపిన సందర్భాలు లేవని.. అందుకే గంగ, బ్రహ్మపుత్రలపై జరిగే ఈ పర్యాటకయాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్ నుంచి..

వారణాసిలో 13న ప్రారంభమయ్యే ఈ షిప్ టూరిజంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన పర్యాటకులు ప్రత్యేకంగా ప్రయాణించనున్నారు. ఈ 52 రోజుల్లో వీరు 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. పట్నా, కోల్ కతా, ఢాకా (బంగ్లాదేశ్), ధుబ్రి (బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భారత భూభాగం), గువాహటి, మీదుగా మజూలీ ఐలాండ్ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ షిప్ లో ప్రయాణించే పర్యాటకులు, ఈ రెండు నదుల ఒడ్డున ఉండే ప్రముఖ నగరాలను, పర్యాటక క్షేత్రాలను సందర్శిస్తారు. జల మార్గాలు, షిప్పింగ్, నౌకాశ్రయాల మంత్రిత్వ శాఖ ఈ షిప్ టూరిజం ప్రాజెక్టునకు సంధానకర్తగా ఉంది. ఇందులో పర్యాటకులకు అన్నిరకాలు సౌకర్యాలు చేపట్టినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలో షిప్ టూరిజానికి ఈ రకమైన షిప్ ప్రయాణం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. దేశంలో షిప్ టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోందని, రానున్న రోజుల్లో భారతీయ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా జాతీయ పర్యాటక విధానం (National Tourism Policy) కి రూపకల్పన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం అన్ని వర్గాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

WhatsApp channel