‘World’s dirtiest man’ dies : ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి కన్నుమూత-worlds dirtiest man dies in iran at 94 a few months after first bath ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  `World`s Dirtiest Man` Dies In Iran At 94 A Few Months After First Bath

‘World’s dirtiest man’ dies : ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి కన్నుమూత

HT Telugu Desk HT Telugu
Oct 26, 2022 10:01 PM IST

‘World’s dirtiest man’ dies : World's Dirtiest Man అమౌ హాజీ మరణించారు. ఇరాన్ లోని ఒక కుగ్రామం దేజ్గా లో నివసించే అమౌ హాజీ కి 94 ఏళ్లు. దాదాపు 50 ఏళ్లకు పైగా ఆయన స్నానం చేయలేదు.

World's Dirtiest Man అమౌ హాజీ
World's Dirtiest Man అమౌ హాజీ (AFP)

‘World’s dirtiest man’ dies : ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఇరాన్ కు చెందిన అమౌ హాజీ ఆదివారం చనిపోయారు. దాదాపు 50 ఏళ్లుగా స్నానం చేయని అమౌ హాజీ.. 50 ఏళ్ల తరువాత దాదాపు నెల క్రితమే స్నానం చేశారు. దురదృష్టవశాత్తూ, స్నానం చేసిన నెల రోజులకే ఆయన కన్నుమూశారు.

ట్రెండింగ్ వార్తలు

‘World’s dirtiest man’ dies : దశాబ్దాలుగా స్నానం లేదు..

ఇరాన్ లోని చిన్న గ్రామం దేజ్గా లో నివసించే అమౌ హాజీ ఒంటరి వాడు. గ్రామస్తులు నిర్మించి ఇచ్చిన చిన్న పూరిపాకలో ఉండేవాడు. గ్రామస్తులు ఎంత కోరినా, బెదిరించినా స్నానం చేసేవాడు కాదు. దాదాపు గత 50 ఏళ్లుగా ఆయన స్నానం చేయలేదు. ఒంటిపై పేరుకుపోయిన మట్టితో, చీలిక పీలికలైన దుస్తులతోనే ఉండేవాడు.

‘World’s dirtiest man’ dies : ఫ్రెష్ ఆహారం కూడా వద్దు..

స్నానం చేస్తే అనారోగ్యం పాలవుతాననే నమ్మకంతో అమౌ హాజీ ఉండేవాడు. చిన్నప్పుడు ఏదో ఒక కారణంతో ఈ నమ్మకం ఆయనలో బలపడిపోయి ఉంటుందని మానసిక వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, శుభ్రమైన, వేడి ఆహారం తింటే కూడా అనారోగ్యం పాలవుతానని ఆయన నమ్మకం. దాంతో, గ్రామస్తులు ఇచ్చిన ఫ్రెష్ ఫుడ్ తినేవాడు కాదు. ఎండిపోయిన జంతువుల మలంతో ఉన్న పైప్ ను పీల్చేవాడు.

‘World’s dirtiest man’ dies : ఇటీవలనే స్నానం చేశాడు..

గ్రామస్తులంతా కలిసి బలవంతంగా కొన్ని నెలల క్రితం ఆ dirtiest man in the world కి స్నానం చేయించారు. అయితే, అలా స్నానం చేసిన నెల రోజులకే అనారోగ్యం పాలై అతడు చనిపోయాడు. 2013లో అమౌ హాజీపై "The Strange Life of Amou Haji" అనే డాక్యుమెంటరీని కూడా రూపొందించారు.

IPL_Entry_Point