World Water Day : నేడు ప్రపంచ జల దినోత్సవం.. ఇప్పటికైనా మేలుకోకపోతే- వినాశనం!-world water day know history theme significance amid bengaluru water crisis ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  World Water Day: Know History, Theme Significance Amid Bengaluru Water Crisis

World Water Day : నేడు ప్రపంచ జల దినోత్సవం.. ఇప్పటికైనా మేలుకోకపోతే- వినాశనం!

Sharath Chitturi HT Telugu
Mar 22, 2024 07:20 AM IST

World Water Day : నేడు ప్రపంచ జల దినోత్సవం. బెంగళూరు నీటి సంక్షోభం వార్తలకెక్కిన తరుణంలో.. జల దినోత్సవానికి ప్రధాన్యత పెరిగింది.

మార్చ్​ 22ని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు..
మార్చ్​ 22ని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు.. (PTI)

World Water Day 2024 : ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ప్రపంచ జల దినోత్సవం, మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక సందర్భం. ముఖ్యంగా ఈ సంవత్సరం బెంగళూరు నీటి సంక్షోభం మధ్య.. వరల్డ్​ వాటర్​ డేకి ప్రముఖ్యత సంతరించుకుంది. రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో టెక్ హబ్ బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ జల దినోత్సవం.. చరిత్ర

1992లో రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సదస్సులో ఎజెండా 21 కింద ప్రపంచ జలదినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబరులో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ద్వారా మార్చి 22 ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించారు.

ప్రాముఖ్యత..

World Water Day 2024 Theme : ఐక్యరాజ్యసమితి (ఐరాస) మంచి నీటి వనరుల సుస్థిర నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటుంది. ఈ రోజున, నీరు, పారిశుద్ధ్యంపై ఐక్యరాజ్యసమితికి చెదిన ఫ్లాగ్షిప్ నివేదిక ప్రతి సంవత్సరం విడుదల అవుతుంది.

2024 థీమ్..

ఈ ఏడాది థీమ్.. 'సమృద్ధి, శాంతి కోసం నీరు' (వాటర్​ ఫర్​ ప్రాస్పరిటీ అండ్​ పీస్​). ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ (డబ్ల్యూడబ్ల్యూడీఆర్) నివేదికపై 2024 ఎడిషన్ ఫోకస్​ చేస్తుంది. థీమ్ ప్రతి సంవత్సరం మారుతుంది. కానీ సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6 లక్ష్యాలకు అనుగుణంగా స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రధాన దృష్టి ఉంటుంది.

ఐక్యరాజ్యసమితి ప్రపంచ జల దినోత్సవం 2024 సందేశంలోనిముఖ్యాంశాలు..

  • శాంతిని చేకూర్చగలిగే శక్తి, విధ్వంసాన్ని సృష్టించగలిగే సామర్థ్యం.. నీటికి ఉంటుంది. నీటి కొరత లేదా నీరు కలుషితమైనప్పుడు లేదా ప్రజలు ప్రాప్యత కోసం పోరాడుతున్నప్పుడు సమాజాలలో ఉద్రిక్తతలు తలెత్తుతాయి. అందరి నీటి అవసరాలను సమన్వయం చేసుకోవడం ద్వారానే శాంతి సాధ్యమన్నారు.
  • World water day history : సమృద్ధి, శాంతి అనేవి నీటిపై ఆధారపడి ఉంటాయి. సామూహిక వలసలు, రాజకీయ అశాంతి మధ్య.. వాతావరణ మార్పులపై ఎలా పోరాడాలి? అన్న ప్రపంచ దేశాల చర్చల్లో.. నీటి పాత్ర చాలా కీలకంగా మారింది.
  • నీరు మనల్ని సంక్షోభం నుంచి బయటపడేస్తుంది- న్యాయమైన, సుస్థిరమైన నీటి వినియోగం చుట్టూ ఐక్యం కావడం ద్వారా సమాజాలు, దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించవచ్చు. ఐక్యరాజ్యసమితి సమావేశాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం, స్థానిక స్థాయిలో చర్యలను అమలు చేయడం ద్వారా నీటి సంక్షోభాన్ని శాంతియుతంగా అధిగమించవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం