Supreme Court to Centre: ఆదానీ ఇష్యూలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్
Supreme Court to Centre: ఆదానీ - హిండెన్ బర్గ్ అంశానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. సెబీ కమిటీకి సంబంధించి కేంద్రం సీల్డ్ కవర్ లో పంపిన సిఫారసులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Supreme Court to Centre on Adani issue: ఇన్వెసర్లు పెట్టిన డబ్బుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, అందువల్ల ఈ విషయంలో పూర్తి పారదర్శకతను ఆశిస్తున్నామని సీల్డ్ కవర్ సజెషన్స్ ను తోసిపుచ్చుతూ Supreme Court ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) వ్యాఖ్యానించారు. ఆదానీ - హిండెన్ బర్గ్ అంశానికి (Adani-Hindenburg issue) సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
Supreme Court to Centre: ఆదానీ అవకతవకలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ (Goutham Adani) ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ (Adani-Hindenburg issue) నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో.. ఆదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లన్నీ కుప్పకూలడం ప్రారంభమైంది. దాంతో, దీనిపై, సుప్రీంకోర్టు (Supreme Court)లో పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (PIL) వేశారు.
Supreme Court to Centre on Adani issue: కేంద్రం సీల్డ్ కవర్
దాంతో, ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా సిఫారసులు చేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఆ కమిటీకి సబ్జెక్టు నిపుణులను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పలువురు నిపుణుల పేర్లను సూచిస్తూ ఒక సీల్డ్ కవర్ ను శుక్రవారం కోర్టుకు సమర్పించింది.
Supreme Court to Centre on Adani issue పారదర్శకత కీలకం
కేంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. నిపుణులను సూచించే విషయంలో రహస్యం అవసరం లేదని, అందువల్ల ఈ సీల్డ్ కవర్ ను తాము స్వీకరించలేమని స్పష్టం చేసింది. కేంద్రం సూచించలేని పక్షంలో తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఇక్కడ చాలా ముఖ్యమని, సీల్డ్ కవర్ సిఫారసులను ఆమోదించి, వారి విశ్వాసాలను దెబ్బతీయలేమని పేర్కొంది. ఈ అంశంలో పారదర్శకత చాలా కీలకమని వ్యాఖ్యానించింది. అనంతరం కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ లో పెట్టింది.