Ujjain viral video : ఉజ్జెయిని ఆలయంలో మహిళా సిబ్బంది ‘డ్యాన్స్‌లు’.. చివరికి!
Mahakal temple instagram viral video : ఉజ్జెయిని మహంకాళీ ఆలయంలో డ్యాన్స్ చేశారు ఇద్దరు మహిళా సిబ్బంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. వారిపై సస్పెన్ష్ వేటు పడింది.
Mahakal temple instagram viral video : మధ్యప్రదేశ్ ఉజ్జెయిని మహంకాళీ ఆలయంలో డ్యాన్స్ చేసిన ఇద్దరు మహిళా సిబ్బందిపై వేటు పడింది. డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన అనంతరం.. ఆ ఇద్దరిని అధికారులు సస్పెండ్ చేశారు.
ఉజ్జెయిని మహంకాళీ ఆలయం లోపల డ్యాన్స్ వీడియోలు వైరల్‌గా మారడం ఇది కొత్త విషయమేమీ కాదు. కానీ భద్రతా సిబ్బంది ఈ విధంగా వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి. ఫలితంగా.. భద్రతా సిబ్బంది ఇక మీదట ఆలయం లోపలికి సెల్ఫోన్లు తీసుకురావొద్దని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది.
Mahakal Ujjain viral video : తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోలో బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఇద్దరు మహిళా సిబ్బంది కనిపిస్తున్నారు. 'ప్యార్ ప్యార్ కర్తే కర్తే', 'జీనే కే బహానే లఖోన్' వంటి హిందీ పాటలకు వారిద్దరు స్టెప్పులేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ఇన్స్టెంట్గా వైరల్ అయిపోయింది. చివరికి అధికారుల దృష్టికి వెళ్లింది. వారిద్దరు సస్పెన్ష్‌కు గురయ్యారు.
ఉజ్జెయిని మహంకాళీ ఆలయంలోని గర్భగూడికి సంబంధించిన వీడియోలు ఇటీవలే వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత.. ఆలయ గర్భగుడిలోపలికి సెల్ఫోన్లు తీసుకురావద్దని, ఫొటోలు తీయవద్దని నిషేధం విధించారు.
Mahakal temple latest news : "మహాకాల్ లోక్‌ను ఆవిష్కరించిన తర్వాత.. భక్తుల రద్ది పెరిగింది. గర్భగుడిలోపలికి వచ్చే భక్తులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఇతర భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే గర్భగుడి లోపలికి సెల్ఫోన్లను అనుమతించడం లేదు," అని ఆలయ సిబ్బంది గత నెలలో ప్రకటన చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:
ఆలయాల్లో.. సెల్ఫోన్లపై నిషేధం
Ban on mobile phones in temples : భక్తుల ప్రవర్తన శృతి మించుతుండటంతో.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో సెల్ఫోన్లపై నిషేధం అమలవుతోంది. తమిళనాడు ప్రభుత్వం సైతం.. రాష్ట్రంలోని అన్ని ఆలయ ప్రాంగణాల్లో సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం విధించనుంది. ఈ మేరకు.. మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్.. కమిషనర్ ఆఫ్ హిందూ రిలీజియస్ అండ్ ఛారిటీస్ ఎన్డోమెంట్స్ డిపార్ట్మెంట్(హెచ్ఆర్ అండ్ సీఈ)కు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని ఆలయాల పవిత్రత, స్వచ్ఛతను పరిరక్షించేందుకు.. సెల్ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది.
తిరుచెందూర్లోని అరుల్మిగు సుబ్రహ్మణియ స్వామి ఆలయంలో సెల్ఫోన్లపై నిషేధం విధించాలని.. సీతారామన్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం