COVID Fear: కరోనా భయం: మూడేళ్లుగా కొడుకుతో పాటు ఇంట్లోనే మహిళ.. భర్తను కూడా రానీయకుండా తాళం
Covid-19 Fear: కొవిడ్ భయంతో ఓ మహిళ ఏకంగా తన కొడుకుతో కలిసి మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం భర్తను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. మూడు సంవత్సరాలుగా ఆ బాలుడి కనీసం సూర్యుడిని కూడా చూడలేదట.
Women Locked for 3 Years in House: కరోనా వైరస్ (COVID-19) భయంతో ఓ మహిళ ఏకంగా మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోకి ఎవరినీ రానీయలేదు. తన 10 ఏళ్ల కుమారుడితో కలిసి అదే ఇంట్లో లోపల తాళం వేసుకొని ఉంటున్నారు. మూడేళ్లుగా కనీసం తన భర్తను కూడా ఇంట్లోకి ఆమె రానివ్వలేదు. ఆ ఇంట్లో తల్లీకొడుకు ఉంటున్నట్టు ఇరుగుపొరుగు వారికి కూడా తెలియదు. గురుగ్రామ్(Gurugram) లోని చక్కర్‌పూర్ (Chakkarpur)లో జరిగింది ఈ విషయం. అయితే, తాజాగా ఆ మహిళ భర్త సుజన్ మజీ.. పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. పూర్తి వివరాలు ఇవే..
ఇళ్లంతా చెత్త
Women Locked for 3 Years in House: మహిళ భర్త సుజన్ ఫిర్యాదుతో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇంటికి చేరుకున్నారు. ఎంత పిలిచినా ఆ మహిళ తలుపులు తెరవకపోవడంతో బద్దలుకొట్టారు. మున్‍మున్ అనే ఆ మహిళను, ఆమె 10 సంవత్సరాల కుమారుడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, మూడేళ్లుగా చెత్త కూడా బయటపడేయకపోవడంతో ఇళ్లంతా దారుణంగా మారింది. ఇళ్లంతా చెత్త విపరీతంగా పేరుకుపోయింది.
సూర్యుడిని కూడా చూడకుండా..
Women Locked for 3 Years in House: ఆ మహిళ 2020లో ఇంటికి లోపలి నుంచి తాళం వేసుకొని కొడుకుతో పాటు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే అప్పటి నుంచి ఆ పిల్లాడు కనీసం సూర్యుడిని కూడా చూడలేదట. అంటే కొవిడ్ భయంతో అసలు ఆ పిల్లాడిని బయటి ప్రదేశాన్ని కూడా ఆమె చూడనిచ్చే వారు కాదట. ఇంటి నుంచి బయటికి వెళితే తన కొడుకు చనిపోతాడని భయపడేవారట. కనీసం చెత్త కూడా బయటపడేసేవారు కాదు. ఆ పిల్లాడు ఇంట్లోనే గోడలపై పెయింటింగ్ వేసి కాలక్షేపం చేసే వాడు.
నిత్యావసరాలు ఇలా..
Women Locked for 3 Years in House: 2020లో తొలి దశ లాక్‍డౌన్ ఎత్తేశాక ఆ మహిళ భర్త సుజన్.. ఆఫీస్ పని నిమిత్తం బయటికి వెళ్లారు. ఇక ఆ తర్వాత తిరిగి వచ్చినా ఆయనను ఆమె ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో ఆయన వేరే ఇంట్లో ఉంటున్నారు. వీడియో కాల్ ద్వారా మాత్రమే వీరి మధ్య మాటలు నడిచేవి. తన భార్య, కొడుకు ఉంటున్న ఇంటి రెంట్, కరెంట్ బిల్, కొడుకు స్కూల్ ఫీజు ఇలా అన్నీ ఆయనే కడుతూ వచ్చారు. ఇక నిత్యావసరాలు, కూరగాయాలు మెయిన్ డోర్ దగ్గర పెట్టేవారు. ఆయన వెళ్లిన తర్వాత ఆ మహిళ వచ్చి వాటిని తీసుకెళ్లి మళ్లీ వెెంటనే లోపలికి వెళ్లి తాళం వేసుకునేవారు.
ఆ మహిళ, ఆమె కుమారుడిని పోలీసులు బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.