Woman rejects engineer for salary : పెళ్లి విషయంలో ఈ మధ్యకాలంలో మహిళల ఆలోచనలు మారాయి. ఎక్కువ జీతం ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సంబంధిత వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే.. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా భావిస్తున్నారు. ఇలాంటి వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ వ్యక్తి.. తన స్నేహితుడికి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 8లక్షల ప్యాకేజ్ ఉన్న కారణంతో.. తన స్నేహితుడిని ఓ మహిళ రిజెక్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు.
"గతేడాది.. నా స్నేహితుడికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. నా స్నేహితుడు ఒక ఇంజినీర్. రూ. 8లక్షల ప్యాకేజ్ వస్తుంది. అది సరిపోదని, కనీసం రూ. 25లక్షల ప్యాకేజ్ ఉండాలని, ఆ మహిళ రిజెక్ట్ చేసింది. పని చేయలేకపోతున్నానని ఆ మహిళ తన ఉద్యోగాన్ని వదిలేసింది. ఇప్పుడు ఏం పని చేయడం లేదు," అని ట్విట్టర్లో చెప్పాడు ఓ నెటిజన్.
"అబ్బాయి జీతం తక్కవని రిజెక్ట్ చేశారు." అని ఆ నెటిజెన్ పేర్కొన్నారు.
ఈ పోస్ట్ వెంటనే వైరల్గా మారింది. పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే 5.1లక్షల వ్యూస్, 3900 లైక్స్ వచ్చాయి. అయితే.. చాలా మంది ఆ మహిళకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
Trending new latest : "మంచిదే! ఎక్స్పెక్టేషన్స్ (అంచనాలు) ఉంటే తప్పేముంది? పైగా.. పెళ్లికి ముందే ఆ మహిళ తనకు కావాల్సింది చెప్పింది. ఇది అబ్బాయికే మంచిది! 2-3ఏళ్లల్లో ఆ అబ్బాయి రూ. 25లక్షల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో మహిళను పెళ్లి చేసుకుంటాడు," అని ఓ నెటిజెన్ రాసుకొచ్చారు.
"మెట్రో నగరాల్లో బతకాలంటే రూ. 8లక్షల ప్యాకేజ్ చాలా తక్కువ. కనీసం రూ. 15లక్షల ప్యాకేజ్ ఉండాలి," అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
"చాలా కఠినమైన విషయం. కానీ నిన్ను, నిన్నులా యాక్సెప్ట్ చేసేవారు నీకు దొరుకుతారు," అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
Salary criteria for marriage : "అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉండటంలో తప్పు లేదు. కానీ.. రూ. 25లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని.. అతడికి ఉద్యోగం పోతే? ఆ మహిళ ఏం చేస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఈ 8లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తి.. రానున్న రోజుల్లో రూ. 25లక్షల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంది కదా! పెళ్లి విషయంలో జీతం అనేది ఎలా ముఖ్యమవుతుంది," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.
"ప్రిఫరెన్స్లను స్పష్టంగా చెబుతున్న వారిని తిట్టుకోకండి. పెళ్లి తర్వాత సమస్యలతో బాధపడటం కన్నా ఇది బెటర్," అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
Salary criteria for marriage by women in India : మరి మీరేం అంటారు? అబ్బాయికి రూ. 8లక్షల ప్యాకేజ్ సరిపోదా? అసలు పెళ్లి విషయంలో జీతం ఒక్కటి చూస్తే సరిపోతుందా? ఇలా రిజెక్ట్ చేయడం కరెక్టేనా?
సంబంధిత కథనం