Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ-woman recounts uber ride horror when driver masturbated he had his penis out ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uber Ride Horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

HT Telugu Desk HT Telugu
May 16, 2024 02:39 PM IST

Uber ride horror: ఉబర్ రైడ్ ఒక మహిళకు పీడకలగా మిగిలింది. కార్ డ్రైవర్ కారును నడుపుతూనే అశ్లీలంగా ప్రవర్తించడంతో ఆమె షాక్ కు గురైంది.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ డ్రైవర్ ను ఉబర్ డ్రైవర్స్ లిస్ట్ లో నుంచి తొలగించినట్లు ఉబర్ ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock)

Uber ride horror: ఆస్ట్రేలియాకు చెందిన 26 ఏళ్ల మహిళ తాను కారు వెనుక సీట్లో ఉండగా ఉబర్ డ్రైవర్ కారు నడుపుతూనే హస్తప్రయోగం చేసుకున్నాడని ఆరోపించింది. దీంతో ఉబెర్ సంస్థ ఆ డ్రైవర్ ను తన యాప్ నుంచి తొలగించింది. అస్ట్రేలియాలోని అడిలైడ్ కు చెందిన టైలా పిమ్లాట్ ఈ భయానక అనుభవాన్ని యాహూ న్యూస్ తో పంచుకుంది.

ఉబర్ డ్రైవర్ అశ్లీల చర్యలు

టైలా పిమ్లాట్ అడిలైడ్ లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన (Uber ride horror) చోటు చేసుకుందని పిమ్లాట్ తెలిపింది. ఆ డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తూనే, తన ప్యాంట్ ను కిందకు లాగి హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. దాంతో, నేను షాక్ కు గురయ్యాను. అతను తన పురుషాంగాన్ని బయటకు తీశాడని, అతను హస్త ప్రయోగం చేస్తున్నాడని నేను స్పష్టంగా గమనించాను’’ అని ఆమె వివరించారు. కార్ బయల్దేరగానే తాను తన ఫోన్ ను చూడడం ప్రారంభించానని, ఒకసారి యధాలాపంగా డ్రైవర్ వైపు చూడగా, అతను హస్తప్రయోగం చేస్తుండటాన్ని గమనించానని వివరించింది.

భయపడిపోయి.. తల్లికి మెసేజ్

ఆ దృశ్యాన్ని చూసి భయపడిన ఆ మహిళ తనను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో ఆ డ్రైవర్ ను ఏమీ అనలేదు. కానీ, వెంటనే తన తల్లికి మెసేజ్ చేసి తన ముందు జరిగిన విషయాన్ని చెప్పింది. తన ఉబర్ రైడ్ ను ట్రాక్ చేయడానికి తన తల్లికి లైవ్ లింక్ ను కూడా ఆమె షేర్ చేసింది. అలాగే, డ్రైవర్ చర్యను తన ఫోన్ లో రికార్డ్ చేసింది. ‘‘ఓ దేవుడా, నేను చనిపోవచ్చు, నేను అత్యాచారానికి గురి కావచ్చు. ఈ వ్యక్తి నన్నేమైనా చేయవచ్చు.. నన్ను కాపాడు’’ అని దేవుడిని ప్రార్థించానని ఆమె చెప్పారు. ‘అప్పుడు నా మెదడు స్తంభించిపోయింది, నా గుండె వేగంగా కొట్టుకుంది... నేను చలా భయపడ్డాను’’ అన్నారు. ‘మరోసారి ఉబర్ వాడకూడదని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు

ఈ ఘటనపై పిమ్లాట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనను క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ ఖండించింది. ఆ వ్యక్తిని తన యాప్ లోని డ్రైవర్స్ లిస్ట్ నుండి తొలగించింది.

IPL_Entry_Point