Woman hits man's private parts: ముంబై లో ఒక యువతి ఒంటరిగా ఉన్న తనపై అత్యాచారానికి ప్రయత్నించిన 30 ఏళ్ల యువకుడి మర్మావయవాలను గాయపర్చి, తనను తాను రక్షించుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ ను ఓ మహిళ వంటగదిలోని ఇనుప గరిటతో కొట్టి, గాయపరిచింది. అనంతరం, ఇరుగుపొరుగుకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఆసుపత్రికి తరలించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండి ప్రాంతంలో 26 ఏళ్ల యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండగా, అనిల్ సత్యనారాయణ్ రచ్చ (30 ) అనే వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడు, మహిళ ఒకరికొకరు తెలిసినవారేనని పోలీసులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అనిల్ సత్యనారాయణ రచ్చ ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. మర్మావయవాలను ప్రదర్శిస్తూ, ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే, ఆ యువతి తనను తాను రక్షించుకునేందుకు వంటగదిలోకి పరిగెత్తి అక్కడ ఉన్నఇనుప గరిటను తీసుకుని, అతడి జననాంగాలపై గట్టిగా కొట్టి గాయపరిచింది. దాంతో అనిల్ సత్యనారాయణ రచ్చ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, ఆ యువతి స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని ఆసుపత్రికి తరలించారు
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనిల్ సత్యనారాయణ్ రచ్చ (30 ) పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద మహిళ గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, అతిక్రమణకు సంబంధించిన సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. నిందితుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నందున అతన్ని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో.. గత నెలలో బిహార్ లోని సరన్ జిల్లాలో ఓ యువతి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడనే కారణంతో ఒక యువకుడిపై దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్స్ ను నరికేసిన విషయం తెలిసిందే.పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె వద్ద నుంచి రక్తపు మరకలు ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు తనతో రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని, ఇప్పుడు ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఆయువతి పోలీసులకు తెలిపింది. తన ప్రపోజల్ ను అతను తిరస్కరించడంతో తమ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని, దాంతో, ఆవేశంలో అతడి జననాంగాలను నరికేశానని పోలీసులకు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో గత రెండేళ్లుగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది.