Gang Rape in Rajastan: భర్త ఎదుటే గ్యాంగ్ రేప్; ముగ్గురి అరెస్ట్-woman gang raped in front of husband in rajasthan 3 arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gang Rape In Rajastan: భర్త ఎదుటే గ్యాంగ్ రేప్; ముగ్గురి అరెస్ట్

Gang Rape in Rajastan: భర్త ఎదుటే గ్యాంగ్ రేప్; ముగ్గురి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

Gang Rape in Rajastan: భర్త ఎదుటే ఒక మహిళను నలుగురు రాక్షసులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాజస్తాన్ లో సంచలనం సృష్టించింది.

ప్రతీకాత్మక చిత్రం

Gang Rape in Rajastan: రాజస్తాన్ లోని సిరోహి జిల్లాలో వాచ్ మెన్ ఉద్యోగం చేసే వ్యక్తి ఇంట్లో రెండు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

Gang Rape in Rajastan: దొంగతనానికి వచ్చి..

రాత్రి సమయంలో లోపలికి వచ్చిన నలుగురు దొంగలు ముందుగా, ఆ భర్తను బంధించారు. అతడిని కొట్టి అతడి వద్ద ఉన్న రూ. 1400 తీసుకున్నారు. మరిన్ని డబ్బులు, బంగారం కావాలని ఆ దంపతులపై చేయి చేసుకున్నారు. ఆ భర్తను కట్టేసి, విపరీతంగా కొట్టారు. అయినప్పటికీ, తమ వద్ద ఇక డబ్బు, బంగారం ఏమీ లేదని వారు చెప్పడంతో, అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు.

Gang Rape in Rajastan: పోలీసు కేసు

ఈ ఘటనతో షాక్ గురైన ఆ భార్యభర్తలు మర్నాడు ఉదయం వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తరువాత స్థానికుల సహకారంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన తరువాత నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని, సమీప గ్రామంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.