Crime news : 31 గంటల నరకం! జైలులో భర్త- యువతిపై సామూహిక అత్యాచారం..-woman gang raped by brother in law others during 31 hour ordeal two held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 31 గంటల నరకం! జైలులో భర్త- యువతిపై సామూహిక అత్యాచారం..

Crime news : 31 గంటల నరకం! జైలులో భర్త- యువతిపై సామూహిక అత్యాచారం..

Sharath Chitturi HT Telugu
Jan 26, 2025 09:00 AM IST

Maharashtra crime news : మహారాష్ట్రలో షాకింగ్​ ఘటన జరిగింది. ఆ యువతిపై ఆమె భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి, తన సహచరులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె భర్త జైలులో ఉండగా ఈ ఘటన జరిగింది.

31 గంటల నరకం!
31 గంటల నరకం!

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ యువతిపై ఆమె భర్త సోదరుడు, ఇతరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 31 గంటల పాటు ఆమె నరకం చూసింది.

ఇదీ జరిగింది..

18ఏళ్ల యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కానీ అప్పటికి ఆమె ఒక మైనర్​. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులు యువతి భర్తపై ముంబై అంథేరీ పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టారు. అతడిని అరెస్ట్​ చేసిన పోలీసులు ముంబై జైలులో పెట్టారు. కాగా, భర్తకు బెయిల్​ కోసం ఆ యువతి బయట చాలా కష్టాలు పడింది. ఈ నేపథ్యంలోనే.. భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి.. ఆ యువతిని సంప్రదించాడు. తమ్ముడుకి బెయిల్​ ఇప్పిస్తానని, తనను కలవాలని యువతికి చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె.. బుధవారం ఉదయం నాసిక్​కి వెళ్లి అతడిని కలిసింది.

బెయిల్​కి గ్యాంటర్​ని పరిచయం చేస్తానని చెప్పి యువతికి ఆ వ్యక్తి పంచవటి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతనితో మరికొందరు చేరారు. ఆమెకు భోజనం ఆఫర్​ చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ వెంటనే ఆమెపై దాడి చేశారు!

యువతిని నిందుతులు చెట్టుకు కట్టేశారు. చాలా సేపు కొట్టారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పలుమార్లు కొట్టారు. ఆమె చాలా సార్లు స్పృహ కోల్పోయింది. తిరిగి కళ్లు చెరిచేసరికి ఆ రోజు గడిచిపోయింది! గురువారం ఉదయం స్పృహలోకి వచ్చిన ఆమెకు నడవానికి ఇబ్బంది అయ్యింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ వారందరు ఆమెను మళ్లీ కొట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే జరిగింది! టాయిలెట్​కి వెళ్లాలని చెప్పి, ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. ఆమెను పట్టుకునేందుకు నిందితుల్లో ఒకరు ప్రయత్నించారు. అతడిని వదిలించుకుని ఆమె పారిపోయింది.

చివరికి.. నాసిక్​కి వెళ్లిన యువతి.. పోలీస్​ స్టేషన్​లో కేసు దాఖలు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న వ్యక్తి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు విజయ్​ దామ్లే, గోపాల్​ రాజేంద్ర నాగోల్కర్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు. మరో ఇద్దరిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.