షాకింగ్​! చనిపోయిన 8 నిమిషాలకు కళ్లు తెరిచిన మహిళ- మరణానంతర జీవితం ఎలా ఉంటుందో చెప్పింది..-woman comes back to life after experiencing death for 8 minutes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  షాకింగ్​! చనిపోయిన 8 నిమిషాలకు కళ్లు తెరిచిన మహిళ- మరణానంతర జీవితం ఎలా ఉంటుందో చెప్పింది..

షాకింగ్​! చనిపోయిన 8 నిమిషాలకు కళ్లు తెరిచిన మహిళ- మరణానంతర జీవితం ఎలా ఉంటుందో చెప్పింది..

Sharath Chitturi HT Telugu

హాస్పిటల్​లో చేరిన ఓ 33ఏళ్ల మహిళలో చలనం లేదు, ఊపిరి తీసుకోలేదు, మెదడు పనిచేయలేదు, పల్స్​ కూడా లేదు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. కానీ 8 నిమిషాల తర్వాత ఆమె కళ్లు తెరిచింది! ఆ తర్వాత, మరణానంతర జీవితం గురించి చెప్పింది.

మరణం నుంచి వెనక్కి వచ్చిన మహిళ.. (Representative image)

అమెరికాలో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాను ఊపేస్తోంది! ఓ 33ఏళ్ల మహిళ మరణించిన 8 నిమిషాలకు కళ్లు తెరిచింది! తొలుత ఆమెలో చలనం లేదు, ఊపిరి తీసుకోలేదు, మెదడు పనిచేయలేదు, పల్స్​ కూడా లేదు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే, మళ్లీ బతికింది! ఆ తర్వాత.. మరణానంతర జీవితం గురించి ఆమె అనేక విషయాలను చెప్పింది.

అసలేం జరిగిందంటే..

ఆ మహిళ పేరు బ్రియన్నా లాఫెర్టీ. మరణం నుంచి తిరిగి రావడంపై ఆమె మీడియాకు ఈ విధంగా చెప్పింది.

"మరణం అనేది ఒక భ్రాంతి. ఎందుకంటే మన ఆత్మ ఎప్పటికీ చావదు. మనం స్పృహలోనే ఉంటాము. మన ఆత్మ వేరే చోటకు వెళుతుంది," అని బ్రియన్నా చెప్పుకొచ్చింది.

మరణం తర్వాత తిరిగి జీవితం పొందడం గురించి మాట్లాడుతు.. "నొప్పి లేదు. అంతా ప్రశాంతంగా, క్లియర్​గా అనిపించింది," అని వివరించింది.

"నా భౌతిక దేహం నుంచి నన్ను ఉన్నట్టుండి వేరు చేశారు. నా గురించి నాకు గుర్తులేదు. నా మనిషి జీవితం గురించి గుర్తులేదు. చలనం లేకుండా ఉండిపోయాను. కానీ నాలో లైఫ్​ ఉన్నట్టు అనిపించింది. ఎక్కడో తేలుతున్నట్టు అనిపించింది. టైమ్​ అనేదే లేని చోట ఉండిపోయాను," అని పేర్కొంది.

ఇదెలా సాధ్యం?

మనిషి మరణం నుంచి ఎలా తిరిగొస్తాడు? ఇదెలా సాధ్యం? అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే, బ్రియన్నా.. అరుదైన "మైయక్లోనుస్​ డిస్టోనియా" అనే న్యూరోలాజికల్​ కండీషన్​లోకి జారుకుని ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఆమె 'నియర్​- డెత్​' ఎక్స్​పీరియెన్స్​కి ఇదే కారణం అయ్యుండొచ్చని అంటున్నారు.

ఈ కండీషన్​ వల్ల శరీరంలోని అవయవాలు పనిచేయడం ఆపేస్తాయి. ఈ కండీషన్​ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. దీనికి చికిత్స అంటూ ఏది లేదు. కానీ కండీషన్​తో కలిగే లక్షణాలను తగ్గించవచ్చు. ఓరల్​ మెడికేషన్స్​, థెరపీలు, బొటూలినమ్​ న్యూరోటాక్సిన్​ ఇంజెక్షన్లను వాడుతారు.

వాస్తవానికి ఈ కండీషన్​ గురించి వైద్య ప్రపంచంలో కూడా ఇంకా సరైన అవగాహన లేదు. దీనిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.