Crime news : కూతురితో తండ్రి సెక్స్.. గర్భం దాల్చిన యువతి! ముగ్గురు పసికందులను చంపి..
Crime news : పోలాండ్లోని ఓ ఇంట్లో.. ముగ్గురు పసికందుల మృతదేహాలు లభించాయి. ఆ ఇంట్లోని తండ్రీ-కూతురి మధ్య అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. యువతి గర్భం దాల్చగా.. ముగ్గురు పిల్లలు జన్మించారు. వారిని ఆ ఇద్దరు చంపేశారు!
Poland Crime news : పోలాండ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురితో సెక్స్ చేసిన తండ్రి, ఆమెను గర్భవతిని చేశాడు. ముగ్గురు పిల్లలు జన్మించగా.. వారందరిని ఆ ఇద్దరు చంపేశారు!
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఉత్తర పోలాండ్ డాన్స్క్లో జెర్నికి అనే గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 54ఏళ్ల వ్యక్తికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మొదటి కూతురి వయస్సు 20ఏళ్లు! కాగా.. వారిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తున్నట్టు సమాచారం.
పోలాండ్ పోలీసులు.. శుక్రవారం నాడు వారి ఇంటికి వెళ్లారు. కదలిక లేని ఓ పసికందు వారికి కనిపించింది. ఆ శిశువు మరణించిందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటిలో సోదాలు నిర్వహించారు. కుళ్లిపోయిన దశలో ఉన్న మరో శిశువు మృతదేహాన్ని సైతం అధికారులు గుర్తించారు.
Father daugther incest relation : ఇక ఇంటి పరిసరాల్లో శనివారం నాడు సోదాలు నిర్వహించగా.. మూడో శిశువు మృతదేహం లభించింది. పసికందుల మృతదేహాలకు సంబంధించి.. ఆ కుటుంబాన్ని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. తమ మధ్య భౌతిక సంబంధం ఉన్నట్టు తండ్రీ-కూతురు చెప్పారని తెలుస్తోంది. పసికందులను హత్య చేసిన నేరం కింద ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై.. హత్య, అక్రమ సంబంధం కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఆ 54ఏళ్ల వ్యక్తికి.. రెండో కుమార్తెతో కూడా అక్రమ సంబంధం ఉందని పోలాండ్ మీడియా అనుమానం వ్యక్తం చేసింది.
సంబంధిత కథనం