India census : దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు.. త్వరలోనే మొదలవ్వనున్నాయా?
India census : 2020లో జరగాల్సిన జనాభా లెక్కలు.. ఇప్పటికీ మొదలవ్వలేదు. మరి జనగణన ఎప్పుడు మొదలవుతుంది?
India census : జనాభా సంఖ్యలో చైనాను ఇండియా దాటేసిందని వార్తలు వచ్చాయి. దానిని రుజువు చేసేందుకు జరగాల్సిన జనగణన మాత్రం దేశంలో ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. కొవిడ్ కారణంగా 2020 నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కలు.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు!
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాతే..!
ఎన్పీఆర్ (నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్)ను అప్డేట్ చేసేందుకు ఉపయోగపడే హౌజ్ లిస్టింగ్ దశ.. వాస్తవానికి 2020 ఏప్రిల్ 1- సెప్టెంబర్ 30 మధ్యలో జరగాల్సి ఉంది. కానీ కొవిడ్ కారణంగా అది జరగలేదు. అప్పటి నుంచి జనాభా లెక్కల కార్యకలాపాలు హోల్డ్‌లోనే ఉంటున్నాయి. జనగణనకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కాగా.. ఎప్పుడు జనాభా లెక్కలు మొదలైనా.. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, కార్స్, టూ వీలర్స్ వంటి వాటికి యాక్సెస్ ఉందా? లేదా? అన్న ప్రశ్నలతో పాటు మొత్తం మీద 31 ప్రశ్నలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం.. జనగణనకు ముందు.. జిల్లాలు, ఉప జిల్లాలు, మండలాలు, పోలీస్ స్టేషన్ల పాలనా పరమైన సరిహద్దులను మూడు నెలల పాటు ఫ్రీజ్ చేసి ఉంచాలి. ఆ తర్వాతే జనగణన మొదలుపెట్టాలి. ఇలా ఫ్రీజ్ చేసేందుకు ఈ ఏడాది జూన్ 30 వరకు గడువునిచ్చింది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అంటే ఏదైనా మార్పులు చేసుకోవాలంటే జూన్ 30 నాటికి పూర్తవ్వాలి. అనంతరం అక్కడి నుంచి 3 నెలల వరకు జనగణన చేయకూడదు. అంటే సెప్టెంబర్ వరకు జనగణన జరగని పని!
ఇదీ చూడండి:- World population is 8 bn: ప్రపంచ జనాభా 800 కోట్లు; భారత్ దే మెజారిటీ షేర్
Census in India 2023 : అదే సమయంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఇతర కార్యకలాపాలను త్వరగా మొదలుపెట్టాలని ఈసీ ఆశిస్తోందని సమాచారం. మరోవైపు జనగణన కోసం 30లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు శిక్షణ ఇవ్వాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. వీటన్నింటినీ చూస్తుంటే.. సెప్టెంబర్ 30 తర్వాత కూడా జనగణన జరగడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే.. ఈ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లేనే ఎన్నికల సంఘం కూడా ఉపయోగించుకుంటుంది. అంటే.. 2020లో జరగాల్సిన జనగణన.. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వతే మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తొలి డిజిటల్ సెన్సెస్..!
ఇండియాలో జనగణనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు జరిగినా.. దేశ చరిత్రలో ఇదే తొలి డిజిటల్ సెన్సెస్గా నిలిచిపోనుంది. ఇందుకోసం అధికారులు ఓ పోర్టల్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఇంట్లో ఎలాంటి పప్పుధాన్యాలు వాడుతున్నారు, తాగునీరు- లైట్ సోర్స్‌లు ఏంటి, టాయిలెట్లకు యాక్సెస్ ఉందా, స్నానాలకు వెసులుబాటు ఉందా, ఎల్పీజీ/ పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఈ దఫా జనగణనలో అడిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం