PM Modi: దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ ఘాటు సందేశం-will never compromise on an inch of land pm modis strong diwali message ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ ఘాటు సందేశం

PM Modi: దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ ఘాటు సందేశం

Sudarshan V HT Telugu
Oct 31, 2024 05:02 PM IST

PM Modi: 2024 సంవత్సరం కూడా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత ప్రధాని మోదీ దీపావళి వేడుకలను సాయుధ దళాలతో కలిసి కచ్ లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యర్థులకు ఘాటు హెచ్చరిక చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PTI)

PM Modi Diwali message: ఈ సంవత్సరం కూడా దీపావళి వేడుకలను ప్రధాని మోదీ భద్రతా దళాలతో కలిసి జరుపుకున్నారు. కచ్ లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలోని అంగుళం భూమి విషయంలో కూడా తమ ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు.

అన్ని వనరులు అందిస్తాం..

గుజరాత్ లోని కచ్ లో భద్రతా దళాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రధాని మోదీ.. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం సైన్యం, భద్రతా దళాలకు ఆధునిక వనరులను సమకూరుస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సైనిక దళాల్లో ఒకటిగా మన భారత సైన్యాన్ని నిలుపుతామన్నారు. ఈ ప్రయత్నాలకు పునాది రక్షణ రంగంలో మనం సాధించిన స్వావలంబన అని అన్నారు. ‘‘నేడు మనం అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తున్నప్పుడు, మీరంతా ఈ కలను పరిరక్షిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. సరిహద్దు పర్యాటకం జాతీయ భద్రతలో కీలకమైన అంశమని, దీనిని తరచుగా విస్మరిస్తున్నారని, ఈ ప్రాంతంలో కచ్ అందుకు అనువైన ప్రాంతమని ప్రధాని మోదీ అన్నారు.

మీరే మా బలం..

సాయుధ దళాలే భారత దేశ బలమని ప్రధాని మోదీ (narendra modi) అన్నారు. ‘‘ప్రపంచం మిమ్మల్ని చూసినప్పుడు భారత్ బలం కనిపిస్తుంది. మన ప్రత్యర్థులు మిమ్మల్ని చూసినప్పుడు, వారు వారి దురుద్దేశపూరిత ప్రణాళికలకు ముగింపును చూస్తారు. భారత్ తన సరిహద్దులలో ఒక్క అంగుళం విషయంలో కూడా రాజీపడబోదు. అందుకే మన విధానాలు మన సాయుధ దళాల సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ భారతీయ సైనికులతో అన్నారు.

Whats_app_banner