భర్తను చంపిన భార్య.. కొడుకుతో కలిసి..!-wife son thrash man throw him from 7th floor in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Wife, Son Thrash Man, Throw Him From 7th Floor In Maharashtra

భర్తను చంపిన భార్య.. కొడుకుతో కలిసి..!

HT Telugu Desk HT Telugu
Feb 12, 2022 05:26 PM IST

Wife kills husband | భర్తను.. కొడుకు సాయంతో హత్య చేసింది ఓ భార్య. అనంతరం 7వ అంతస్తు నుంచి కిందికి పడేసింది. ఆధారాలను ధ్వంసం చేసేందుకు వారు ప్రయత్నించారు. పోలీసులకు కట్టుకథలు చెప్పారు. చివరికి పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య
కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య (HT telugu)

Maharastra crime news | మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. భర్తను ఓ భార్య హత్య చేసింది. ఇందుకు కొడుకు కూడా సహకరించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

అంబాలీ ప్రాంతంలో.. ఓ వ్యక్తి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. 54ఏళ్ల షాంతను కృష్ణ శేషాద్రి అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. శేషాద్రి గతంలోనూ ఆత్మహత్యకు యత్నించినట్టు అతని భార్య, కుమారుడు పోలీసులకు వెల్లడించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. కొడుకుతో కలిసి భర్తను.. ఆ మహిళ కొట్టి చంపేసినట్టు తేలింది. ఆధారాలను ధ్వంసం చేసేందుకు కూడా వారు యత్నించినట్టు రుజువైంది.

"ప్రాథమిక నివేదిక ప్రకారం.. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. 7వ అంతస్థు నుంచి మృతదేహాన్ని కిందికి పడేసింది," అని పోలీసులు వివరించారు.

ఈ ఘటనపై మర్డర్​ కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ, ఆమె కొడుకును అరెస్ట్​ చేశారు.

కస్టమర్​పై టైలర్​ దాడి..

Tailor attacks customer | మహారాష్ట్రలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవలే.. ఓ టైలర్​.. తన కస్టమర్​పై నడిరోడ్డు మీద కత్తెరతో దాడి చేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన కస్టమర్​ను వెంబడించి పట్టుకుని, కత్తెరతో అనేకమార్లు పొడిచాడు. రూ. 30 కోసం జరిగిన గొడవ ఇందుకు కారణం.

రోహిత్​ యాదవ్​ అనే వ్యక్తి అంధేరీలోని ఓ కంపెనీలో హెచ్​ఆర్​ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. సోమవారం.. ఇంటి దగ్గర ఉన్న హరీశ్​ ఠాకర్​(40) అనే టైలర్​ దగ్గరికి వెళ్లాడు. తన ప్యాంట్​ ఆల్ట్రేషన్​ చేయమని చెప్పి ఠాకర్​కు ఇచ్చాడు. రూ. 100 అవుతుందని టైలర్​ చెప్పగా.. సరే అని రోహిత్​ వెళ్లిపోయాడు.

అదే రోజు మధ్యాహ్నం.. పనైపోయిందని, వచ్చి ప్యాంట్​ తీసుకోవాలని రోహిత్​కు హరీశ్​ ఫోన్​ చేశాడు. అక్కడి రోహిత్​ వెళ్లగా.. తొందరగా పనిపూర్తి చేశానని, అందుకే మొత్తం 130 రూపాయలు ఇవ్వాలని హరీశ్​ డిమాండ్​ చేశాడు. తాను రూ. 100 మాత్రమే ఇస్తానని రోహిత్​ వాదించాడు. వారి మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది.

రూ. 100 ఇచ్చి ప్యాంట్​ తీసుకుని వెళ్లిపోయాడు రోహిత్​. అది చూసి హరీశ్​కు కోపమొచ్చింది. తన కత్తెరతో రోహిత్​ను వెంబడించాడు. నడిరోడ్డు మధ్యలో రోహిత్​ను ఆపి కత్తెరతో బెదిరించాడు. భయపడిన రోహిత్​.. హరీశ్​ను శాంతిపజేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ టైలర్​ మాత్రం తన చేతిలో ఉన్న కత్తెరతో రోహిత్​ కడుపులో పొడిచాడు. పారిపోడానికి ప్రయత్నించిన రోహిత్​ను.. హరీశ్​ పట్టుకుని మరీ పలుమార్లు దాడి చేశాడు. ఆ తర్వాత టైలర్​ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు.. రోహిత్​ను ఆసుపత్రిలో చేర్చారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హరీశ్​ ఠాకర్​ కోసం తీవ్రంగా గాలించారు. మంగళవారం అతడిని పట్టుకుని అరెస్ట్​ చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం