Karnataka High Court : ‘నల్లగా ఉన్నావని భర్తను భార్య అవమానిస్తే.. అది క్రూరత్వమే!’
Karnataka High Court : భర్తను నల్లగా ఉన్నావని భార్య అవమానిస్తే, అది క్రూరత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు. ఈ మేరకు ఓ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.
Karnataka High Court : భర్తను నల్లగా ఉన్నావంటూ భార్య అవమానిస్తే.. అది క్రూరత్వమేనని వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు. ఈ మేరకు 2012 నుంచి వేరుగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
బెంగళూరులో నివాసమున్న సంబంధిత దంపతులకు 2007లో వివాహం జరిగింది. వారికి ఓ ఆడబిడ్డ. అయితే భర్త (44ఏళ్లు)ను భార్య(41ఏళ్లు) నిత్యం తిట్టేది. నల్లగా ఉన్నావని అవమానించేది. కాగా.. భార్య నుంచి తనకు విడాకులు కావాలని 2012లో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు ఆ వ్యక్తి. బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిన ఆ మహిళ.. తన భర్త, అతని కుటుంబానికి వ్యతిరేకంగా గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది.
ఈ వ్యవహారంపై 2017 వరకు విచారణ చేపట్టింది ఫ్యామిలీ కోర్టు. భర్త తరఫు కుటుంబం తనను వేధిస్తోందని మహిళ పేర్కొంది. వరకట్నం అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని, వారిద్దరికి ఓ బిడ్డ కూడా ఉందని ఆరోపించింది. చివరికి.. సదరు వ్యక్తి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఆ తర్వాత అతను కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. భార్య నుంచి విడాకులు కావాలని వ్యాజ్యంలో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ఇటీవలే తీర్పును వెలువరించింది హైకోర్టు.
'అది క్రూరత్వమే..!'
"భర్త నల్లగా ఉన్నాడని, మహిళ నిత్యం అవమానించేది. బిడ్డ కోసం ఆ భర్త అవమానాలను భరించాడు. పైగా ఆ వ్యక్తిపై ఆ మహిళ చాలా ఆరోపణలు చేసింది. వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. దానికి ఆధారాలేవీ మాకు కనిపించలేదు. మహిళ కారణంగా సదరు వ్యక్తి మానసిక క్షోభకు గురయ్యాడు. దీనిని ఫ్యామిలీ కోర్టు గుర్తించలేదు," అని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.
"నల్లగా ఉన్నావంటూ అవమానిస్తే, అది క్రూరత్వమే! భర్తతో కలిసేందుకు ఆ మహిళ అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ వ్యక్తి నల్లగా ఉండటంతో మహిళకు పెళ్లిపై ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది," అని అభిప్రాయపడిన హైకోర్టు.. దంపతులకు విడాకులను మంజూరు చేసింది.
సంబంధిత కథనం