Putin G20 summit : జీ20 సదస్సుకు దూరంగా పుతిన్​.. రష్యాకే నష్టం!-why putin is staying away from g20 summit 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Why Putin Is Staying Away From G20 Summit 2022

Putin G20 summit : జీ20 సదస్సుకు దూరంగా పుతిన్​.. రష్యాకే నష్టం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 07:45 AM IST

Putin G20 summit 2022 : మరికొన్ని రోజుల్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్​ వెళ్లడం లేదు. భంగపాటు నుంచి తప్పించుకునేందుకు ఆయన వెళ్లడం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

జీ20 సదస్సుకు దూరంగా పుతిన్
జీ20 సదస్సుకు దూరంగా పుతిన్ (AP)

Putin G20 summit 2022 : ఇండోనేషియా బాలీలో జరుగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ దూరంగా ఉండనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో కూడా ఆయన ప్రసంగించడం లేదు. 'బిజీ షెడ్యూల్​' అని క్రెమ్లిన్​ చెబుతున్నా.. ఉక్రెయిన్​తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు తనను నిలదీస్తాయేమో అన్న కారణంతోనే.. ఆయన జీ20 సదస్సుకు వెళ్లడం లేదని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇదే కారణమా..?

2014లో ఉక్రెయిన్​లోని క్రిమియాను ఆక్రమించుకుంది రష్యా. ఈ పరిణామాల మధ్య ఆ ఏడాది బ్రిస్బేన్​లో జీ20 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వెళ్లిన పుతిన్​కు.. ఒక రకంగా భంగపాటు ఎదురైందనే చెప్పుకోవాలి! ప్రపంచ దేశాల నేతలు పుతిన్​తో పెద్దగా మాట్లాడలేదు. సంప్రదాయబద్ధంగా దిగే ఫొటోలోనూ పుతిన్​ను చివర్లో నుల్చొబెట్టారు.

ఇప్పుడు ఉక్రెయిన్​పై రష్యా పూర్తిస్థాయి యుద్ధమే చేస్తుండటంతో.. గతంలో కన్నా పరిస్థితులు ఇప్పుడు మరింత తీవ్రంగా ఉండొచ్చని క్రెమ్లిన్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పుతిన్​.. ఈ దఫా జీ20 సదస్సుకు వెళ్లలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2022 G20 Summit date : "సదస్సుకు వెళితే.. మనుషులతో మాట్లాడాలి. ఫొటోలి దిగాలి. కానీ ఆయనతో(పుతిన్​) ఎవరు మాట్లాడతారు? ఎలా ఫొటోలు తీస్తారు? ఉక్రెయిన్​తో యుద్ధంలో ఆయన నిర్ణయం మారదు. ఇతర దేశాధినేతల నిర్ణయాలు కూడా మారవు. మరి జీ20 సదస్సుకు వెళ్లి ఏం లాభం?" అని రష్యా అని గ్లోబల్​ అఫైర్స్​ జర్నల్​ ఎడిటర్​ లక్యనోవ్​ అభిప్రాయపడ్డారు.

క్రెమ్లిన్​.. తాజా పరిణామాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. పుతిన్​ బిజీ షెడ్యూల్​ కారణంగా వెళ్లలేకపోతున్నట్టు చెబుతోంది. కానీ పుతిన్​ అంత బిజీగా ఉండటానికి కారణాలను మాత్రం బయటపెట్టలేదు.

ఇదే సమయంలో.. జీ20 సదస్సులో ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొననున్నారు. పుతిన్​కు వ్యతిరేకంగా.. దేశాధినేతల మద్దతును కూడగట్టే ప్రయత్నం ఆయన చేస్తారు. ఈ కారణంతోనే.. పుతిన్​ వీడియో కాన్ఫరెన్స్​ కూడా నిర్వహించడం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Putin Russia Ukraine war : "చెప్పడానికి పుతిన్​ వద్ద ఏం లేదు. ఉక్రెయిన్​కు సంబంధించి ఇరు వర్గాలను సంతోషింపజేసే విధంగా ఆయన వద్ద ప్రతిపాదనలేవీ లేవు. మరి వెళ్లడం ఎందుకు?" అని రాజకీయ విశ్లేషకుడు కాన్​స్టాటిన్​ కలచెవ్​ పేర్కొన్నారు.

ఏది ఏమైనా.. యుద్ధం పరిణామాలతో రష్యాకే నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు జీ20 వంటి పెద్ద సదస్సుకు దూరంగా ఉండటంతో రష్యా మరింత ఒంటరి అయిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా ఉక్రెయిన్​ మధ్య ఫిబ్రవరి నుంచి యుద్ధం కొనసాగుతోంది. భారీ మొత్తంలో సైనికులను ఉక్రెయిన్​లోకి పంపించారు పుతిన్​. ఉక్రెయిన్​పై సులభంగా గెలవచ్చు అని భావించారు. కానీ ఉక్రెయిన్​ ప్రతిఘటించడంతో.. రష్యా అంచనాలు తలకిందులయ్యాయని, భారీ సంఖ్యలో రష్యాకు నష్టం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.

జీ20 సదస్సు..

Russia Ukraine war : ఇక 2022 జీ20 సదస్సు.. నవంబర్​ 15-16 తేదీల్లో ఇండోనేషియా బాలీలో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇండోనేషియాకు వెళ్లనున్నారు.

ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, బ్రిటన్​ ప్రధానమంత్రి రిషి సునక్​లు పాల్గొననున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం