National Highway construction : దారుణంగా పతనమైన రోడ్డు నిర్మాణ 'వేగం'.. కారణమేంటి?-why india s road building slumped from 37 to 19 km a day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Why India's Road-building Slumped From 37 To 19 Km A Day

National Highway construction : దారుణంగా పతనమైన రోడ్డు నిర్మాణ 'వేగం'.. కారణమేంటి?

Subhash Narayan HT Telugu
Sep 20, 2022 10:55 AM IST

National Highway construction slumped in India : దేశంలో జాతీయ రహదారుల నిర్మాణ వేగం తగ్గింది. గతంలో రోజుకు 37కి.మీల రోడ్డు వేస్తే.. ఇప్పుడది కేవలం 19కి.మీలుగా ఉంది. దీనికి గల కారణాలేంటి?

దారుణంగా పతనమైన రోడ్డు నిర్మాణ 'వేగం'.. కారణమేంటి?
దారుణంగా పతనమైన రోడ్డు నిర్మాణ 'వేగం'.. కారణమేంటి?

National Highway construction slumped in India : 2025 ఆర్థిక ఏడాది నాటికి 2లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ లక్ష్యానికి తగ్గట్టుగానే.. ఇంతకాలంలో వేగంగా రోడ్లను నిర్మించుకుంటూ వెళ్లింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా దేశంలో రోడ్డు నిర్మాణం మందగించింది! అప్పట్లో రోజుకు 34కిలోమీటర్ల రోడ్డు వేస్తే.. ఇప్పుడది కేవలం 19.కిమీలకే పరిమితమవుతోంది. ఇందుకు కారణం ఏంటి?

ట్రెండింగ్ వార్తలు

India Road Construction target : టార్గెట్​ 2లక్షల కి.మీల జాతీయ రహదారి..

కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మరో మూడు సంవత్సరాలు పాటు.. ఏడాదికి కనీసం 20వేల కి.మీల రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. 34,800 కి.మీల భారత్​మాలా హైవే ప్రాజెక్టు కూడా ఇందులో భాగమేే. వీటితో పాటు రానున్న మూడేళ్లల్లో 8వేల కి.మీల గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​వేని నిర్మించాలని నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎన్​హెచ్​ఏఐ) నిశ్చయించుకుంది. కాగా.. 2023ఆర్థిక ఏడాదిలో 25వేల కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. నిరుడు బడ్జెట్​ సమావేశాల్లో వెల్లడించారు.

India road construction : ప్రస్తుతం పరిస్థితేంటి?

2021ఆర్థిక ఏడాదిలో జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు వేగంతో దూసుకెళ్లింది. కరోనా కారణంగా రోడ్లు ఖాళీగా ఉండటంతో పాటు ప్రణాళికలు రచించేందుకు కాంట్రాక్టర్లకు సరైన సమయం దొరకడంతో.. నాడు రోజుకు 37కి.మీల రోడ్డును నిర్మించేశారు. మొత్తం మీద ఆ ఆర్థిక ఏడాదిలో 13,327కి.మీల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.

2022 ఆర్థిక ఏడాది వచ్చే సరికి పరిస్థితులు మారిపోయాయి. రోడ్డు నిర్మాణం 20శాతం మేర పడిపోయింది. రోజుకు 29.కిమీల చొప్పున.. 10,457కి.మీల జాతీయ రహదారి నిర్మాణం మాత్రమే జరిగింది. ఇక 2023ఆర్థిక ఏడాదిలో నిర్మాణం మరింత మందగించింది. ఏప్రిల్​- ఆగస్టులో కేవలం 2,912 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారు. కొవిడ్​ రెండో దశ పీక్​లో ఉన్నప్పుడు వేసిన రోడ్ల(3,355కి.మీలు) కంటే ఇది తక్కువగా ఉండటం గమనార్హం.

వేగం తగ్గడానికి కారణమేంటి?

National Highway construction speed : కొత్త రోడ్లు వేయాలంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భూములను సేకరించడం, ఆర్థిక వనరులు, కాంట్రాక్టర్ల ప్రణాళికలు, ఇతర బిల్లులను సమయానికి క్లియర్​ చేయడం వంటివి వీటిల్లో కీలకం. అయితే.. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ వేగం తగ్గడానికి భూముల సేకరణలో ఆలస్యం, భూమి ధరలు పెరిగిపోవడం కారణమని కేంద్రం చెబుతోంది. రుతుపవనాల ప్రభావం కాస్త ఉన్నట్టు స్పష్టం చేసింది.

రానున్న రోజుల్లో పరిస్థితేంటి?

Road construction NHAI : 2023ఆర్థిక ఏడాదిలో 12వేల కి.మీల జాతీయ రహదారిని ఇండియా నిర్మించే అవకాశం ఉంది. సెప్టెంబర్​లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ ఏడాది టార్గెట్​ను ఇండియా చేరుకోవచ్చు. ప్రస్తుత ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని ఎన్​హెచ్​ఏఐకి రోడ్డు రవాణశాఖ ఆదేశాలిచ్చింది. మిగిలిన ఆర్థిక ఏడాదిలో.. రోజుకు 60కిమీల రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్​ గడ్కరీ టార్గెట్లు ఇచ్చేశారు.

<p>రోడ్డు నిర్మాణం పరిస్థితి</p>
రోడ్డు నిర్మాణం పరిస్థితి ((Mint))

మరి నిధుల పరిస్థితేంటి?

National Highway construction funds : జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఎన్నడూ లేని విధంగా 2023ఆర్థిక ఏడాది బడ్జేట్​లో అత్యధిక నిధులు కేటాయించింది కేంద్రం. రూ. 1,99,108కోట్లు కేటాయించింది. వీటిల్లో రూ. 1,34,015కోట్లు ఎన్​హెచ్​ఏఐకే వెళతాయి.

సంబంధిత కథనం

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.