Omicron: కొత్తగా ఎక్స్ఈ వేరియంట్ .. డబ్యూహెచ్ వో హెచ్చరిక !
ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఒమైక్రాన్ XE అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందని తాజా నివేదికలో హెచ్చరించింది.
ప్రపంచంలో XE ఒమైక్రాన్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక వివరాల ఆధారంగా శుక్రవారం నివేదికను విడుదల చేసింది.
ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే ఇది 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ XE సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని వివరించింది. ఈ XE కరోనా వేరియంట్ మొదటిసారి యూకేలో జనవరి 19వతేదీన కనుగొన్నట్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రముఖ వైరాలజిస్ట్ టామ్ పికాక్ వీటిపై స్పందిస్తూ.. మాతృ వైరస్ లాగే వాటి సబ్ వేరియంట్ల కూడా ప్రభావం చూపుతాయని అన్నారు. ఇక XD సబ్ వేరియంట్ పై స్పందిస్తూ.. ఇది పెద్ద ప్రమాదం కాదని.. ఇది డెల్టా నుంచి వచ్చిందని చెప్పుకొచ్చారు.
భారత్ లో కరోనా కేసులు…
మరోవైపు భారత్ లోకరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 15 వందల దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 1200కు చేరాయి. ఇ
> కొత్తగా నమోదైన కేసులు : 1,260
> నమోదైన మరణాలు : 83( మొత్తం మరణాలు 5,21,264)
> క్రియాశీల కేసుల సంఖ్య : 13,445 (0.03%)
> నిన్న పంపిణీ చేసిన టీకాలు : 18,38,552 ( మొత్తం డోసుల సంఖ్య: 184,52,44,856)
టాపిక్