Porn star arrested : ఇండియాలో బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ అరెస్ట్​..-who is riya barde bangladeshi porn star arrested for fake indian documents ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Porn Star Arrested : ఇండియాలో బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ అరెస్ట్​..

Porn star arrested : ఇండియాలో బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ అరెస్ట్​..

Sharath Chitturi HT Telugu
Sep 28, 2024 10:13 AM IST

నకిలీ పత్రాలతో భారత్​లో అక్రమంగా ఉంటున్నందుకు.. బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ రియా బార్డేని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె రాజ్ కుంద్రా ప్రొడక్షన్స్​లోని పలు ప్రాజెక్టుల్లో పనిచేశారని పోలీసులు తెలిపారు.

బంగ్లాదేశ్​ అడల్ట్​ ఫిల్మ్​ స్టార్​ రియా బార్డే అరెస్ట్​!
బంగ్లాదేశ్​ అడల్ట్​ ఫిల్మ్​ స్టార్​ రియా బార్డే అరెస్ట్​! (Onlinetadka/X)

బంగ్లాదేశ్​ అడల్ట్​ ఫిల్మ్​ నటి రియా అరవింద బార్డే ఇండియాలో అరెస్ట్​ అయ్యారు. బంగ్లాదేశ్​ నుంచి వచ్చి ఫేక్​ డాక్యుమెంట్స్​తో ఇంండియాలో నివాసముంటున్న కారణంతో ఆమెని అరెస్ట్​ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

yearly horoscope entry point

రియా బార్డే అరెస్ట్​..

బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ రియా బర్డేని మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్ నగర్​లో గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఉల్హాస్ నగర్​లోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్​కు రియా బార్డే ఐడెంటిటీ, చీటింగ్, ఫోర్జరీ కేసులో ప్రమేయం గురించి సమాచారం అందింది. అరెస్ట్​ అనంతరం ఆమెపై ఫారెనర్స్​ యాక్ట్​తో పాటు మోసం, ఫోర్జరీకి సంబంధించిన ఐపీస సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రియా బర్డే గుర్తింపుపై ఏడాది క్రితం దర్యాప్తు ప్రారంభించామని, ఆమె బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాస్​పోర్టులో పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాలు, హుగ్లీ, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అచల్పూర్ అనే మూడు వేర్వేరు జన్మ స్థలాలు ఉన్నాయని తేలింది.

ఇదీ చూడండి:- Siddaramaiah: ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు

రియా బర్డే తన సొంత డాక్యుమెంట్లను తయారు చేయడమే కాకుండా, తన సహచరుల్లో ఒకరికి నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పాస్​పోర్టు పొందడానికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చి మహారాష్ట్రలో నివాసముంటున్న వారిలో 8మందిని ఈ వారంలో పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిలో రియా బార్డే ఒకరు.

ఎవరు ఈ రియా బార్డే..?

రియా అరవింద్ బార్డే బంగ్లాదేశ్ పోర్న్ స్టార్!. ఆమెని ఆరోహి బార్డే, బన్నా షేక్ అని కూడా పిలుస్తారు.

రియా బార్డే తన తల్లి అంజలి బార్డేను (అలియాస్​ రూబీ షేక్), సోదరుడు రవీంద్ర (అలియాస్​ రియాజ్ షేక్), సోదరి రీతు (అలియాస్​ మోనీ షేక్​)తో కలిసి భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు.

ఆమె తల్లి అమరావతికి చెందిన అరవింద్ బర్డేను వివాహం చేసుకుందని పోలీసు అధికారులు ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపారు.

ప్రస్తుతం రియా తండ్రి, తల్లి ఖతార్​లో నివసిస్తున్నారని, ఆమె తోబుట్టువుల ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు.

రియా బార్డే అడల్ట్ ఫిల్మ్ నటి అని, ఆమె రాజ్ కుంద్రా ప్రొడక్షన్స్​లోని పలు ప్రాజెక్టుల్లో పనిచేశారని పోలీసులు తెలిపారు. నటి గెహనా వశిష్ట్​తో కలిసి పలు చిత్రాల్లో ఆమె నటించారు.

ఆమ్రాస్ (2023) అనే సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు ఉందని ఫిల్మ్ సైట్ ఐఎండీబీ తెలిపింది.

అనైతిక రవాణా నిరోధక చట్టం కింద వ్యభిచారానికి సంబంధించిన కేసులో రియా బర్డేను గతంలో ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు!

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.