Who is Siddaramaiah?: 40 ఏళ్ల అప్రతిహత రాజకీయ ప్రస్థానం సిద్ధ రామయ్య సొంతం-who is congress veteran siddaramaiah karnatakas cmdesignate ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Who Is Congress Veteran Siddaramaiah - Karnataka's Cm-designate?

Who is Siddaramaiah?: 40 ఏళ్ల అప్రతిహత రాజకీయ ప్రస్థానం సిద్ధ రామయ్య సొంతం

HT Telugu Desk HT Telugu
May 18, 2023 02:59 PM IST

Who is Siddaramaiah?: కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధ రామయ్య మే 20 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరో సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారు.

కర్నాటక కాబోయే సీఎం సిద్ధ రామయ్య
కర్నాటక కాబోయే సీఎం సిద్ధ రామయ్య

Who is Siddaramaiah?: కర్నాటక (Karnataka) తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధ రామయ్య రాజకీయ ప్రస్థానం గత 40 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. సిద్ధ రామయ్య జీవితంలోని ముఖ్యమైన విషయాలు..

ట్రెండింగ్ వార్తలు

Who is Siddaramaiah?: సిద్ధ రామయ్య జీవిత విశేషాలు

  • 1948 ఆగస్ట్ 12న సిద్ధ రామయ్య (Siddaramaiah) జన్మించారు. మైసూరు యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేశారు. ఆ తరువాత అదే యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ కూడా చేశారు. అనంతరం న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.
  • 1983 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి భారతీయ లోక్ దళ్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
  • చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు ఓడిపోయారు.
  • కన్నడను అధికార భాషగా అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ‘కన్నడ కావలు సమితి (Kannada Kavalu Samiti)’ కి మొదటి చైర్మన్ గా వ్యవహరించారు. ఈ ‘కన్నడ కావలు సమితి (Kannada Kavalu Samiti)’ రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్న సమయంలో ఏర్పాటైంది. ఆ తరువాత హెగ్డే మంత్రివర్గంలో సిద్ధ రామయ్య (Siddaramaiah) పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 1992లో జనతాదళ్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1994లో దేవే గౌడ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే, 1999లో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు.
  • 2004 లో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2005 లో దేవేగౌడతో విబేధాలు రావడంతో సిద్ధరామయ్య (Siddaramaiah) ను జేడీఎస్ నుంచి బహిష్కరించారు.
  • 2006 లో సిద్ధ రామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2008 నుంచి 2018 వరకు వరుసగా వరుణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2018 లో ఈ నియోజకవర్గంలో తన కుమారుడిని నిలబెట్టి, తాను మళ్లీ చాముండేశ్వరి నియోజకవర్గానికి వెళ్లారు.
  • 2013 నుంచి 2018 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్నాటకను ఐదేళ్ల పూర్తి కాలం పరిపాలించిన రెండో సీఎంగా రికార్డు సృష్టించారు. అంతకుముందు దేవ్ దాస్ ఉర్స్ మాత్రమే ఫుల్ టర్మ్ సీఎంగా ఉండగలిగారు.
  • 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా సిద్ధ రామయ్య (Siddaramaiah) సొంతం.

IPL_Entry_Point