New Election Commissioners: నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ల పూర్తి వివరాలు..
New Election Commissioners Details: మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ లను కొత్త ఎన్నికల కమిషనర్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్యానెల్ ఎంపిక చేసింది.వీరిద్దరు గతంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు కీలక విభాగాల్లో సేవలను అందించారు.
New Election Commissioners news: మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్ లను ఎన్నికల సంఘంలో కొత్త ఎన్నికల కమిషనర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్యానెల్ ఎంపిక చేసింది. ఫిబ్రవరిలో ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడం, గతవారం మరో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దాంతో, కొత్తగా ఇద్దరు ఈసీలను ఎంపిక చేయడం అనివార్యంగా మారింది.
ఆరుగురిలో ఇద్దరు
ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం ఆరుగురి పేర్లు ప్యానెల్ ముందుకు వచ్చాయని ప్యానెల్లో ఉన్న కాంగ్రెస్ నేత అధిర్ చౌదరి తెలిపారు. వీరిలో ఉత్పల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ త్రిపాఠి, జ్ఞానేష్ కుమార్, ఇందీవర్ పాండే, సుఖ్బీర్ సింగ్ సంధు, సుధీర్ కుమార్ గంగాధర్ రహతే ఉన్నారు. 200 మందికి పైగా అభ్యర్థుల జాబితా నుంచి ఆ ఆరుగురి పేర్లను ఎలా షార్ట్ లిస్ట్ చేశారనే దానిపై స్పష్టత లేదని అధిర్ విమర్శించారు.
ఎవరీ సుఖ్బీర్ సింగ్ సంధు?
1963లో జన్మించిన సుఖ్బీర్ సింగ్ సంధు 1998 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు సంధు ఉన్నత విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) చైర్మన్ గా కూడా పనిచేశారు. అమృత్ సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన సంధు అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ నుంచి హిస్టరీ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆయన లా డిగ్రీ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. పంజాబ్ లోని లుధియానా మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేసిన సేవలకు గుర్తింపుగా సుఖ్బీర్ సింగ్ సంధు కు రాష్ట్రపతి మెడల్ లభించింది. భారత జన గణన సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా 2001లో ఆయన రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు.
ఎవరీ జ్ఞానేష్ కుమార్?
జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.
టాపిక్