Noida twin towers : ఇళ్లు కొనుగోలు చేసిన ఆ 200 కుటుంబాల పరిస్థితేంటి?-who actually got punished homebuyers after razing of noida twin towers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Who Actually Got Punished: Homebuyers After Razing Of Noida Twin Towers

Noida twin towers : ఇళ్లు కొనుగోలు చేసిన ఆ 200 కుటుంబాల పరిస్థితేంటి?

Sharath Chitturi HT Telugu
Aug 28, 2022 07:53 PM IST

Noida twin towers demolished : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేతతో కొందరు సంబరాలు చేసుకున్నారు. కానీ చాలా మంది ఆందోళనతో భయపడిపోయారు. ఇళ్లకు డబ్బులు కట్టిన తమ పరిస్థితేంటో అర్థంకాక కుమిలిపోతున్నారు!

నోయిడా ట్విట్​ టవర్స్​ కూల్చివేతతో ఏర్పడిన దుమ్ము
నోయిడా ట్విట్​ టవర్స్​ కూల్చివేతతో ఏర్పడిన దుమ్ము (Bloomberg)

Noida twin towers demolished : నోయిడాలో సూపర్​టెక్​ ట్విన్​ టవర్స్​ వివాదానికి ఆదివారంతో ముగింపు పడింది! వివాదాస్పద ట్విన్​ టవర్స్​ను 3700 కేజీల పేలుడు పదార్థాలతో కేవలం 9 సెకన్లలో కూల్చివేశారు అధికారులు. ఆ దృశ్యాలు చూసి.. సూపర్​టెక్​ గ్రూప్​నకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారందరు సంబరాలు చేసుకున్నారు. కానీ.. సూపర్​టెక్​ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసి.. సొంతిటి కల నెరవేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న వారు.. ఆందోళనలోకి కూరుకుపోయారు.

ట్రెండింగ్ వార్తలు

ఎన్​సీఆర్​ పరిధిలో ఇళ్లను సొంతం చేసుకోవాలని ఆశించిన చాలా మంది.. సూపర్​టెక్​ గ్రూప్​నకు డబ్బులు చెల్లించారు. వారిలో గురుగ్రామ్​కు చెందిన అరుణ్​ మిశ్రా ఒకరు.

Supertech twin towers : గురుగ్రామ్​లోని సూపర్​టెక్​ హిల్​ టౌన్​ ప్రాజెక్టుకు.. 2015లో డబ్బులు చెల్లించారు అరుణ్​ మిశ్రా. అప్పటి నుంచి సొంతింటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం జరిగిన పరిణామాలు చూసి.. ఆయన మనస్సు చాలా బాధపడింది.

<p>ట్విన్​ టవర్స్​ కూల్చివేతను వీక్షిస్తున్న స్థానికులు</p>
ట్విన్​ టవర్స్​ కూల్చివేతను వీక్షిస్తున్న స్థానికులు (ANI)

"నోయిడా ట్విన్​ టవర్స్​​ వ్యవహారంలో నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇక్కడ నిజమైన శిక్ష ఎవరికి పడింది? ట్విన్​ టవర్స్​ని కూల్చివేస్తే సరిపోతుందా? బిల్డర్​ని ఎందుకు జైలుకు పంపలేదు? సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కష్టార్జితంతో ఇళ్లు కొన్నారు. ఇళ్లకి బదులు.. మానసిక ఆందోళన, రీఫండ్​ కోసం అంతులేని ఎదురుచూపులే మిగిలాయి," అని మిశ్రా ఆవేదనకు గురయ్యారు.

Noida twin towers demolition video : 'ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకుని రీఫండ్​ వచ్చేడట్టు చూసింది. కానీ ఆ బిల్డర్​కు చెందిన ఇతర ప్రాజెక్టుల పరిస్థితేంటి? వారికి న్యాయం జరగదా? సూపర్​టెక్​ వద్ద నిధులు లేవు. మరి నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేతకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇతర ప్రాజెక్టుల్లో వచ్చిన డబ్బులను ఇక్కడ వాడేశారని అర్థమవుతోంది. మరి వారందరి పరిస్థితేంటి?' అని కంటతడి పెట్టుకున్నారు మిశ్రా.

<p>కుప్పకూలిన ట్విన్​ టవర్స్​</p>
కుప్పకూలిన ట్విన్​ టవర్స్​

మిశ్రా ఒక్కరే కాదు. ఇలా 200మంది ఉన్నారు. సూపర్​టెక్​కు చెందిన వివిధ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనేందుకు 200మంది డబ్బులు చెల్లించారు. వారందరు ఇప్పుడు ఆదివారం ట్విన్​ టవర్స్​ కూల్చివేత దృశ్యాలు చూసి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ఎందుకు?

Noida twin tower demolition reason : నోయిడాలోని సూపర్​టెక్​ ఎమరాల్డ్​ కోర్ట్​లోని హౌజింగ్​ సొసైటీలో.. 14 భవనాల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రతి భవనంలో 9 ఫ్లోర్లు ఉండాలన్నది అసలు ప్రాన్​. దీనికి నోయిడా అధికారులు కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత.. ఈ 14 టవర్స్​లో.. ప్రతిదానికి 40 ఫ్లోర్లు ఉండే విధంగా డిజైన్​ని సవరించారు. అందులో భాగంగానే ప్రస్తుతం కూల్చివేసిన ట్విన్​ టవర్స్​ను కట్టేశారు.

<p>ట్విన్​ టవర్స్​ పరిస్థితి..</p>
ట్విన్​ టవర్స్​ పరిస్థితి..

కాగా.. ఈ వ్యవహారంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. ఆమోదించిన దాని కన్నా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని 2012లో అలహాబాద్​ కోర్టుకు వెళ్లారు. అందుకు అంగీకరించిన కోర్టు.. వాటిని తొలగించాలని 2014లో సూపర్​టెక్​ గ్రూప్​నకు తీర్పునిచ్చింది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం