Mukul Roy missing : టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్ అదృశ్యం.. అసలేం జరిగింది?
Mukul Roy missing : ప్రముఖ రాజకీయ నేత, టీఎంసీకి చెందిన ముకుల్ రాయ్ కనిపించడం లేదు! కుమారుడితో గొడవ జరిగిన అనంతరం ఆయన అదృశ్యమైనట్టు తెలుస్తోంది.
Mukul Roy missing : పశ్చిమ్ బెంగాల్లో అలజడి! టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్ అదృశ్యం! సోమవారం సాయంత్రం నుంచి ముకుల్ రాయ్ కనిపించడం లేదని ఆయన తనయుడు సుభార్గుషు రాయ్ మీడియాకు తెలిపారు.
అసలేం జరిగింది..?
సోమవారం సాయంత్రం ముకుల్ రాయ్ కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన విమానంలో లేరని తెలుస్తోంది. "ఢిల్లీలో ఆయన రాత్రి 9 గంటలకు దిగాలి. కానీ అలా జరగలేదు. ముకుల్ రాయ్ కనిపించడం లేదు," అని ఈ రాజకీయ నేతకు చెందిన్న సన్నిహితులు వెల్లడించారు.
Mukul Roy TMC : "ఇండిగో ఎయిర్‌లైన్స్ జీఈ- 898లో ముకుల్ రాయ్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఆ విమానం ఢిల్లీలో 9:55కి దిగింది. కానీ నా తండ్రి అందులో కనిపించలేదు," అని సుభార్గుషు రాయ్ తెలిపారు.
ఇదీ చూడండి :- Selfie Video: 'నా భార్య ఆచూకీ చెప్పండి.. లేకపోతే మా శవాల లోకేషన్ షేర్ చేస్తా'
అయితే.. తండ్రీ- కొడుకుల మధ్య సోమవారం గొడవ జరిగినట్టు తెలుస్తోంది. గొడవ అనంతరం ఆయన కనిపించకుండాపోవడం గమనార్హం. మరోవైపు భార్య మరణం తర్వాత నుంచి ముకుల్ రాయ్‌కు ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆయన ఆసుపత్రిలో కూడా చేరారు.
Mukul Roy latest news in Telugu : ముకుల్ రాయ్ అదృశ్యమవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సుభార్గుషు రాయ్ చెప్పారు. కానీ.. మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం పోలీసులకు ఇంకా ఎంటువంటి ఫిర్యాదు అందలేదు!
ఈ వ్యవహారంపై టీఎంసీ కూడా ఇంకా స్పందించలేదు.
ముకుల్ రాయ్.. టీఎంసీలో నెం.2..!
ముకుల్ రాయ్‌కు.. టీఎంసీలో నెం.2 అని గతంలో పేరుంది. కానీ 2017లో ఆయన బీజేపీలో చేరి షాకిచ్చారు. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా టీఎంసీకి వీడ్కోలు పలికారు. బీజేపీ ఆయనకు ఉపాధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు ముకుల్ రాయ్. కానీ కొన్ని రోజులకే మళ్లీ టీఎంసీలోకి చేరిపోయారు.
సంబంధిత కథనం