Southwest monsoon Kerala : గుడ్ న్యూస్.. ఈ నెల 31నే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..
Kerala Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఓ బులిటెన్ని విడుదల చేసింది.
Southwest Monsoon Kerala : కేరళలో 2024 రుతుపవనాల ప్రవేశంతో ఎండలకు అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. ఈ ఏడాది యాంటీసైక్లోనిక్ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. వేడి, తేమతో కూడిన వాతావరణం నుంచి ఉపశమనం కోసం రుతుపవనాలు 2024 కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు.. మే 31న కేరళను తాకే అవకాశం ఉందని బుధవారం అంచనా వేసింది.
నైరుతి రుతుపవనాలు మే 31న కేరళలో ( మోడల్ ఎర్రరర్ ±4 రోజులు ) విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన తాజా బులెటిన్లో పేర్కొంది.నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని స్పష్టం చేసింది.
Southwest Monsoon 2024 : దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
భారతదేశంలో రుతుపవనాల రాకను అంచనా వేయడానికి వాతావరణ శాఖ వివిధ సూచికలను ఉపయోగిస్తుంది. వాయవ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ ద్వీపకల్పంలో రుతుపవనాల పూర్వ వర్షపాతం గరిష్ట స్థాయి, దక్షిణ చైనా సముద్రంపై అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ (ఓఎల్ఆర్), భూమధ్యరేఖ ఆగ్నేయ హిందూ మహాసముద్రంపై తక్కువ ట్రోపోస్ఫెరిక్ జోనల్ గాలులు, నైరుతి పసిఫిక్ మహాసముద్రంపై ఓఎల్ఆర్, భూమధ్యరేఖ ఈశాన్య హిందూ మహాసముద్రంపై ఎగువ ట్రోపోస్ఫెరిక్ జోనల్ గాలులు వీటిలో ఉన్నాయి.
Kerala Southwest Monsoon latest news : సాధారణంగా.. జూన్ 1కి అటు, ఇటుగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. గతేడాది ఎల్ నీనో ప్రభావంతో.. రుతుపవనాలు 8 రోజుల ఆలస్యంగా కేరళను తాకాయి. వర్షాలు కూడా పెద్దగా పడలేదు. కానీ ఇప్పుడు.. అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయంటుండటం ఉపశమనాన్ని ఇచ్చే విషయం.
కేరళను తాకిన అనంతరం.. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి.
ఇక్కడ మాత్రం వడగాల్పులు..
రాజస్థాన్, పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. మే 21న ఈ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Heatwave in North India : పంజాబ్, హరియానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో మే 25 వరకు వడగాలుల నుంచి తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. జమ్మ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మే 25 వరకు వడగాల్పులు వీస్తాయని, మహారాష్ట్రలో మే 24 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
సంబంధిత కథనం