'When Modi's father died': ‘తండ్రి చనిపోయినప్పుడు కూడా మోదీ అలానే చేశారు..’
'When Modi's father died': ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ(100) శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్న మోదీ.. ఆ వెంటనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
'When Modi's father died': తల్లి మరణించిన బాధను దిగమింగి, ఒక కర్మయోగిలా, వెంటనే విధులకు ప్రధాని హాజరు అయ్యారు. పశ్చిమ బెంగాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడం సహా పలు అభివృద్ది కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించారు.
'When Modi's father died': గతంలో కూడా..
ఈ సందర్భంగా గతంలో జరిగిన ఇలాంటి ఒక ఘటనను విశ్వ హిందూ పరిషత్ నేత దిలీప్ త్రివేదీ గుర్తు చేసుకున్నారు. నరేంద్ర మోదీ తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ 1989లో చనిపోయారు. అప్పటికి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాలేదు. కానీ, గుజరాత్ రాజకీయాల్లో నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. నరేంద్ర మోదీ తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ చనిపోయిన రోజే అహ్మదాబాద్ లో కీలకమైన పార్టీ సమావేశం ఒకటి జరిగింది. తండ్రి మరణించడంతో, వాద్ నగర్ వెళ్లిన మోదీ ఈ సమావేశానికి హాజరు కాబోరని అంతా భావించారు. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, మోదీ ఆ సమావేశానికి హాజరయ్యారు.
'When Modi's father died': పార్టీ కూడా ముఖ్యమే..
తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే, వాద్ నగర్ నుంచి బయల్దేరి అహ్మదాబాద్ చేరుకున్న మోదీ, ఆ ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యారు. ‘తండ్రి చనిపోయారు. అంత్యక్రియలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి కదా. మరి ఈ సమావేశానికి ఎలా రాగలిగారు?’ అని సమావేశం పూర్తయిన తరువాత వీహెచ్ పీ నాయకుడు దిలీప్ త్రివేదీ మోదీని ప్రశ్నించాడు. దానికి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘పార్టీ బాధ్యతలు కూడా నాకు అంతే ముఖ్యం’ అని సమాధానమిచ్చారు. ‘ఆ సమాధానం అక్కడి వారిలో ఎంతో స్ఫూర్తిని నింపింది’ అని ఆ వీహెచ్ పీ నేత గుర్తు చేసుకున్నారు. వృత్తి పరమైన బాధ్యతల పట్ల మోదీ మొదటి నుంచి అంతే నిబద్ధతతో ఉండేవారని వివరించారు. ఆ తరువాత, నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థితికి ఎదిగిన విషయం తెలిసిందే.