WhatsApp bans 37 lakh accounts in India: 37 లక్షల వాట్సాప్ అక్కౌంట్లు బ్యాన్-whatsapp bans 37 16 lakh accounts in india in november 60 more than october ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Whatsapp Bans 37.16 Lakh Accounts In India In November, 60% More Than October

WhatsApp bans 37 lakh accounts in India: 37 లక్షల వాట్సాప్ అక్కౌంట్లు బ్యాన్

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 11:39 PM IST

WhatsApp bans 37 lakh accounts: ఒక్క నవంబర్ నెలలోనే 37 లక్షలకు పైగా అకౌంట్లను నిషేధించామని బుధవారం వాట్సాప్(WhatsApp) ప్రకటించింది. అక్టోబర్ నెలలో నిషేధించిన అకౌంట్ల కన్నా నవంబర్ లో 60% ఎక్కువ ఖాతాలను బ్యాన్ చేశామని వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

WhatsApp bans 37 lakh accounts: నవంబర్ నెలలో భారత్ కు చెందిన 37.16 లక్షల ఖాతాలను నిషేధించినట్లు ‘మెటా’ సంస్థకు చెందిన షార్ట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) బుధవారం ప్రకటించింది. అక్టోబర్ నెలలో 23.24 లక్షల అకౌంట్లను బ్యాన్ చేయగా, నవంబర్ లో అంతకన్నా దాదాపు 60% ఎక్కువ ఖాతాలను నిషేధించామని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

proactive banning: యూజర్లు ఫిర్యాదు చేసే ముందే..

నిబంధనలకు అనుగుణంగా లేని, విద్వేషాన్ని ప్రేరేపించే, అసాంఘీక కార్యకలాపాలకు వాడే, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అకౌంట్లను ఎప్పటికప్పుడు వాట్సాప్ తొలగిస్తూ ఉంటుంది. నవంబర్ లో నిషేధించిన అలాంటి అకౌంట్లలో యూజర్లు ఫిర్యాదు చేయడానికి ముందే, ముందస్తుగా గుర్తించి సుమారు 9.9 లక్షల అకౌంట్లను తొలగించామని వాట్సాప్(WhatsApp) తెలిపింది. అక్టోబర్ నెలలో ఇలా యూజర్లు ఫిర్యాదు చేయడానికి ముందే బ్యాన్ చేసిన ఖాతాల సంఖ్య 8.11 లక్షలని వాట్సాప్(WhatsApp) వెల్లడించింది. భారతీయ ఖాతాను 10 అంకెల మొబైల్ నెంబర్ కు ముందు వచ్చే ఇండియా కోడ్ ‘91’ను బట్టి గుర్తిస్తామని తెలిపింది. ఈ వివరాలను భారత ప్రభుత్వం 2021లో అమల్లోకి తీసుకువచ్చిన ఐటీ నిబంధనల (Information Technology Rules 2021) ప్రకారం వాట్సాప్(WhatsApp) వెల్లడించింది.

Information Technology Rules 2021: భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

భారత ప్రభుత్వం గత సంవత్సరం కఠిన ఐటీ నిబంధనల (Information Technology Rules 2021)ను అమల్లోకి తీసుకువచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కచ్చితంగా అమలు చేయాల్సిన కొన్ని నిబంధనలను భారత ప్రభుత్వం అందులో పొందుపర్చింది. వాటిలో, అవాంఛనీయ ఖాతాల తొలగింపునకు, యూజర్ల ఫిర్యాదలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ మూడు నెలలకు ఒకసారి వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది.

IPL_Entry_Point

టాపిక్