Telugu News  /  National International  /  What Magic Did You Do On Mamata?" Ashok Gehlot Asked Vice President
జగదీప్ ధన్కర్, అశోక్ గహ్లోత్
జగదీప్ ధన్కర్, అశోక్ గహ్లోత్

Gehlot Asks Vice President: ‘మమతపై ఏం మాయ చేశారు?’

23 September 2022, 22:05 ISTHT Telugu Desk
23 September 2022, 22:05 IST

Gehlot Asks Vice President: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్కర్ కు రాజస్తాన్ అసెంబ్లీలో ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, జగదీప్ ధన్కర్ ల మధ్య సరదా సంభాషణజరిగింది.

Gehlot Asks Vice President: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ ను ఎన్డీయే ఎంపిక చేసిన సమయంలో.. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్ ల మధ్య పెద్ద ఎత్తున్నే వివాదాలు చెలరేగాయి. ఇరువురూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కేంద్రం తరఫు ఏజెంట్ గా గవర్నర్ వ్యవహరిస్తున్నారని పలుమార్లు మమత ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

Gehlot Asks Vice President: కానీ.. ఎన్నికల్లో సహకారం

ఇంతలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో జగదీప్ ధన్కర్ ను ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. విపక్ష కూటమి తరఫున మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు. విపక్ష కూటమిలో భాగంగా ఉన్న మమత కచ్చితంగా మార్గరెట్ అల్వాకే సపోర్ట్ చేస్తుందని అంతా భావించారు. అదీకాక, జగదీప్ ధన్కర్ తో ఉన్న విభేదాల వల్ల కూడా ఆమె ధన్కర్ కు మద్దతివ్వరని భావించారు. కానీ అనూహ్యంగా మమత పరోక్షంగా జగదీప్ ధన్కర్ కు సపోర్ట్ చేశారు. తమ ఎంపీలు ఈ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఆదేశించడం ద్వారా ఆయనకు పరోక్ష మద్దతు ఇచ్చారు.

Gehlot Asks Vice President: ఏం మాయ చేశారు?

ఇదే విషయాన్ని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉప రాష్ట్రపతి ధన్కర్ కు గుర్తు చేశారు. ‘మమత మీకు ఎలా మద్దతిచ్చారు? మీరేం మ్యాజిక్ చేశారు?’ అని ఆయనను ప్రశ్నించారు. తనకు, పశ్చిమ బెంగాల్ సీఎం కు మధ్య వ్యక్తిగత వైరమేమీ లేదని, ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ బాధ్యతలను మాత్రమే తాను నిర్వర్తించానని, అదే విషయాన్ని ఆమెకు చెప్పానని జగదీప్ వివరించారు. ‘ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన తరువాత ఒకే విషయాన్ని మమత బెనర్జీతో చెప్పాను. నేను ఇప్పుడు మీ రాష్ట్ర గవర్నర్ ను కాను. ఏ నాడు కూడా మీ మర్యాదను తగ్గించేలా, మీ ప్రతిష్ట దిగజారేలా మీ గురించి మాట్లాడలేదు. నా రాజ్యాంగబద్ధ విధులను మాత్రమే నిర్వర్తించాను. అందువల్ల ఆత్మసాక్షిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని మమతను కోరాను’ అని జగదీప్ వివరించారు.