zero shadow day: ఆగస్ట్ 18న బెంగళూరులో జీరో షాడో డే.. హైదరాబాద్ లో ఎప్పుడంటే..?-what is zero shadow day unique celestial event set to grace bengaluru on aug 18 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  What Is Zero Shadow Day? Unique Celestial Event Set To Grace Bengaluru On Aug 18

zero shadow day: ఆగస్ట్ 18న బెంగళూరులో జీరో షాడో డే.. హైదరాబాద్ లో ఎప్పుడంటే..?

HT Telugu Desk HT Telugu
Aug 15, 2023 03:31 PM IST

zero shadow day: అంతరిక్ష ఔత్సాహికులు, పరిశోధకులకు జీరో షాడో డే అనేది ఒక ఆసక్తికరమైన అంశం. జీరో షాడో డే సాధారణంగా సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలా కొద్ది సేపు ఎండలో నిల్చుంటే నీడలు కనిపించవు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

zero shadow day: అంతరిక్ష ఔత్సాహికులు, విద్యార్థులు, పరిశోధకులకు జీరో షాడో డే (Zero shadow day) అనేది ఒక ఆసక్తికరమైన అంశం. జీరో షాడో డే సాధారణంగా సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలా కొద్ది సేపు ఎండలో నిల్చుంటే నీడలు కనిపించవు. బెంగళూరు లో ఈ ఆగస్ట్ 18 న జీరో షాడో డే జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

జీరో షాడో డే అంటే ఏమిటి?

జీరో షాడే డే అంటే నీడలు కనిపించని రోజు అని అర్థం. సాధారణంగా ఏదైనా ఒక మనిషి, జంతువు, లేదా వస్తువుపై వెలుగు పడితే ఆ వెలుగుకు వ్యతిరేక దిశలో ఆ మనిషి, జంతువు, లేదా వస్తువు నీడ కనిపిస్తుంది. ఇది అత్యంత సాధారణ విషయం. కానీ, జీరో షాడో డే (Zero shadow day) రోజు అలా కనిపించదు. అంటే, ఆ రోజంతా కాదు.. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలా కొద్ది సేపు ఎండలో నిల్చుంటే నీడలు కనిపించవు. అందుకు కారణమేంటంటే.. సూర్యకిరణాలు సరిగ్గా నిట్టనిలువున ప్రసరించడం వల్ల ఇలా జరుగుతుంది. భూగోళంపై కర్కట రేఖ, మకర రేఖల మధ్య, అంటే, 23.5-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాల మధ్య మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయా ప్రాంతాలపై నిట్టనిలువుగా, సరిగ్గా నడి నెత్తిన పడినప్పుడు… ఆ ప్రాంతంలోని వస్తువుల నీడలు కనిపించవు. అయితే, ఇది చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఇది ఆ రెండు అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాలకు సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది.

హైదరాబాద్ లో..

బెంగళూరులో అలా ఈ ఆగస్ట్ 18 న జరుగుతుంది. బెంగళూరు నగరంలో ఆగస్ట్ 18 మధ్యాహ్నం 12. 17 గంటల సమయంలో కొద్దిసేపు ఈ దృగ్విషయం గోచరిస్తుంది. ఏప్రిల్ 25న కూడా బెంగళూరు వాసులు ఈ జీరో షాడో డేను చూశారు. హైదరాబాద్ లో జీరో షాడో డే (Zero shadow day) ఈ ఆగస్ట్ 3 వ తేదీన, అలాగే, మే 9వ తేదీన కూడా చోటు చేసుకుంది.

WhatsApp channel
తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.