YouTube Handle : యూట్యూబ్ హ్యాండిల్ అంటే ఏంటి? క్రియేటర్లకు ఏం ఉపయోగం?-what is youtube handle and how will it useful to content creators ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  What Is Youtube Handle And How Will It Useful To Content Creators

YouTube Handle : యూట్యూబ్ హ్యాండిల్ అంటే ఏంటి? క్రియేటర్లకు ఏం ఉపయోగం?

Anand Sai HT Telugu
Oct 26, 2022 08:34 AM IST

YouTube Handle Means : యూట్యూబ్ హ్యాండిల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. హ్యాండిల్ సెట్టింగ్ చేసుకోని వారికి ఆటోమేటిక్ గా టాయిస్తారు. ఇంతకీ యూట్యూబ్ హ్యాండిల్ అంటే ఏంటి? కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగం ఎంత?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

నవంబర్ 14, 2022 తర్వాత సెలక్ట్ చేసుకోని వారికీ.. ఆటోమేటిక్‌గా యూట్యూబ్ హ్యాండిల్‌(YouTube Handle)ను కేటాయిస్తారు. అయితే ఇప్పటికే కొంతమందికి బీటా వర్షన్ లో భాగంగా కేటాయించారు. తర్వాతి వారాల్లో ప్రతి ఛానెల్‌కు హ్యాండిల్‌ను ఎంచుకునే అవకాశాన్ని YouTube క్రమంగా అందుబాటులోకి తెస్తుంది. అర్హత పొందిన వినియోగదారులు ఇప్పటికే YouTube స్టూడియోలో ఇమెయిల్‌లు, నోటిఫికేషన్‌లు పొందారు.

ట్రెండింగ్ వార్తలు

రోజురోజుకు యూట్యూబ్ క్రియేటర్లు(YouTube Creators) పెరుగుతున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసేవరకే పరిమితం అవుతారు. కమ్యూనిటీలోని ఇతర కో-యూట్యూబర్స్‌ని మెన్షన్ చేయాల్సి వస్తే ఇబ్బంది ఎదురవుతుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే యూట్యూబ్ హ్యాండిల్స్ అనే ఫీచర్ తో ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. అనేక ప్రయోజనాలు దీనితో కలగనున్నాయి.

యూట్యూబ్‌లోని కంటెంట్ ప్రొవైడర్లు(YouTube Content Providers) తమ ఛానెల్‌కు ఇతరులను సూచించడానికి హ్యాండిల్‌లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఛానెల్ URL https://youtube.com/@user123గా ఉంటుంది. క్రియేటర్ హ్యాండిల్ @user123గా కనిపిస్తుందన్నమాట. దీని సాయంతో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌(YouTube platform)లో యూజర్లు క్రియేటర్లను సులభంగా కనుగొనచ్చు. వారితో ఇంటరాక్ట్ కావచ్చు. క్రియేటర్లతోనే కాకుండా యూజర్లు ఒకరిని ఒకరు కామెంట్స్‌లో మెన్షన్ చేసి వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది.

క్రియేటర్ల ఛానెల్ పేజీలు, షార్ట్‌లలో హ్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి. హ్యాండిల్స్ అంటే యూజర్ నేమ్స్‌ లాగానే ఉంటాయి. ఒక్కో క్రియేటర్‌కి కేవలం ఒక్కో హ్యాండిల్ మాత్రమే యూట్యూబ్ ఇస్తుంది. దీనిద్వారా ఫేక్, రియల్ యూట్యూబ్ ఛానల్స్‌ని ఈజీగా గుర్తించొచ్చు. వచ్చే నెలలోగా క్రియేటర్లు తమ ఛానెల్ కోసం హ్యాండిల్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

ఈమెయిల్ ద్వారా ఒక నోటిఫికేషన్ ను యూట్యూబ్ పంపిస్తుంది. ఒకవేళ ఛానెల్‌కి ఇప్పటికే కస్టమైజ్డ్ URL ఉంటే, అది ఆటోమేటిక్‌గా వారి డిఫాల్ట్ హ్యాండిల్‌గా మారుతుంది. లేదంటే యూట్యూబ్ స్టూడియోలో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వారు తమ ఛానెల్ కోసం హ్యాండిల్‌ను మార్చడాన్ని ఎంచుకోవాలి. దీనిద్వారా ఉపయోగం ఏంటంటే... ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఏదైనా ఛానల్ పేరు సెర్చ్ చేస్తే.. చాలా పేర్లు కనిపిస్తాయి. కానీ యూట్యూబ్ హ్యాండిల్ వచ్చాక.. మీ ఛానల్ డైరెక్టుగా కనిపిస్తుంది.

ఛానెల్ పేర్లలా కాకుండా హ్యాండిల్స్ అనేవి ప్రతి ఛానెల్‌కు యూనిక్‌గా ఉంటాయి. కాబట్టి క్రియేటర్స్ యూట్యూబ్‌లో తమ ప్రత్యేక ఉనికిని బ్రాండ్‌ను మరింతగా స్థాపించుకునేందుకు అవకాశం ఉంది. క్రియేటర్లు యూజర్లను యూట్యూబ్‌ బయట కూడా వారి కంటెంట్‌కి ఈజీగా రీ డైరెక్ట్ చేసేందుకు ఈ హ్యాండిల్స్ ఉపయోగపడతాయి. నవంబర్ 14 నాటికి హ్యాండిల్‌ను ఎంచుకోకపోతే.. ఛానెల్ పేర్ల ఆధారంగా యూట్యూబ్ వాటిని ఆటోమేటిక్ గా కేటాయిస్తుంది. ఒకవేళ కావాలి అనుకుంటే.. youtube.com/handle నుంచి వారి హ్యాండిల్‌ను ఎడిట్ చేయోచ్చు.

హ్యాండిల్ ఎక్కడ కనిపిస్తుంది?

YouTube అంతటా కొన్ని ప్రదేశాలలో హ్యాండిల్ కనిపించడం ప్రారంభమవుతుంది. వాటితో సహా షార్ట్‌ల ట్యాబ్, సెర్చ్ రిజల్ట్స్, కొన్ని చోట్ల కామెంట్స్, మెన్షన్ చేసినప్పుడు కనిపిస్తుంది. YouTube ఛానెల్ పేజీల వంటి పేజీలలో అనుబంధిత ఛానెల్ పేరు పక్కన హ్యాండిల్‌ ఉంటుంది.

YouTube హ్యాండిల్ నుండి క్రియేటర్లకు లాభం ఏంటి?

షార్ట్‌లలో గుర్తింపు పొందడం క్రియేటర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది ఐడెంటిటీని నిర్ణయించడంలో సహాయపడుతుంది.

వ్యక్తులు హ్యాండిల్‌తో వీడియో క్రియేటర్లను ట్యాగ్ చేయవచ్చు.

YouTube క్రియేటర్లను కనుగొనడంలో ఇతరులకు సహాయం చేయోచ్చు.

క్రియేటర్లు YouTubeలోని ఇతర సభ్యులతో పరస్పర చాట్ చేసే అవకాశం ఉంటుంది.

మీ బ్రాండ్ ని ప్రమోట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

యూజర్లు సెర్చ్ చేస్తే.. నేరుగా మీ ఛానల్ వస్తుంది.

IPL_Entry_Point